Congress Slams : మోదీ మౌనం దేనికి సంకేతం
ప్రశ్నించిన కాంగ్రెస్ పార్టీ
Congress Slams : మణిపూర్ లో చోటు చేసుకున్న అల్లర్లు, హింసాకాండపై నిప్పులు చెరిగింది కాంగ్రెస్(Congress) పార్టీ. గత నాలుగు నెలలుగా వరుసగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నా ఇప్పటి వరకు చర్యలు చేపట్టిన దాఖలాలు లేవని పేర్కొంది. ఇప్పటి వరకు 150 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 300 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. 10 వేల మందికి పైగా సైనిక బలగాలు మోహరించాయి. ఆయుధాలు అసంఘటిత వ్యక్తుల చేతుల్లోకి వెళ్లి పోయాయని ఆవేదన వ్యక్తం చేసింది.
Congress Slams BJP
వందల మంది ఆడ పిల్లలపై అరాచకాలు, అత్యాచారాలు జరిగాయని స్వయంగా సీఎం చెప్పారని, అయినా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని ప్రశ్నించింది. కాపాడాల్సిన పీఎం దేశాలు పట్టుకుని తిరుగుతున్నాడంటూ ధ్వజమెత్తింది. దేశ ప్రజలకు ఏం సందేశం ఇవ్వబోతున్నారంటూ నిలదీసింది కాంగ్రెస్ పార్టీ.
ప్రధాని మౌనం దేశానికే ప్రమాదని ఆవేదన వ్యక్తం చేసింది. ఓ వర్గం పనిగట్టుకుని ఇద్దరు దళిత మహిళలను నగ్నంగా ఊరేగించడం దారుణమని పేర్కొంది. మోదీ కొలువు తీరాక దేశంలో దారుణాలు చోటు చేసుకుంటున్నాయని తీవ్రస్థాయిలో మండిపడింది. కులం పేరుతో, మతం పేరుతో, విద్వేషాల పేరుతో ఓట్లు పొందాలని చూస్తున్నారంటూ ఆరోపించింది కాంగ్రెస్ పార్టీ. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదని సూచించింది.
Also Read : YS Jagan Pawan : పవన్ కు అమ్మాయిల పిచ్చి – జగన్ రెడ్డి