Congress Slams : మోదీ మౌనం దేశానికి శాపం

నిప్పులు చెరిగిన కాంగ్రెస్ పార్టీ

Congress Slams : ప్ర‌ధాన‌మంత్రి నిన్న‌టి దాకా అంతా తానే అయిన‌ట్టు ప్ర‌వ‌ర్తించార‌ని కానీ ఇవాళ మౌనంగా ఎందుకు ఉన్నారో అర్థం కావడం లేదంటూ కాంగ్రెస్ పార్టీ సెటైర్ వేసింది. ఓ వైపు దేశానికి చెందిన మ‌ణిపూర్ కాలి పోతోంద‌ని, జాతుల మ‌ధ్య వైరం కార‌ణంగా ఇప్ప‌టి వ‌ర‌కు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయార‌ని , 60 వేల మందికి పైగా రాష్ట్రం విడిచి పారి పోయార‌ని అయినా బీజేపీ స‌ర్కార్ ఎందుకు మౌనంగా ఉంద‌ని నిల‌దీశారు.

ఆదివారం ట్విట్ట‌ర్ వేదిక‌గా కాంగ్రెస్(Congress) స్పందించింది. మోదీని నిల‌దీసింది. ప్ర‌బ‌ల‌మైన ద్ర‌వ్యోల్బ‌ణంపై మౌనంగా ఉన్నార‌ని, నిరుద్యోగం పెరుగుతున్నా ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క మాట కూడా మాట్లాడ లేదు ఎందుక‌ని అంటూ ప్ర‌శ్నించింది. ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌ను గంప గుత్త‌గా నిర్వీర్యం చేయ‌డం, లేదంటే అమ్మేయ‌డం కాదంటే త‌న వారికి ధారాద‌త్తం చేయ‌డమే ప‌నిగా పెట్టుకున్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది.

మోదీ 9 ఏళ్ల కాలంలో సాధించిన విజ‌యాలు ఏమిటో చెప్పాల‌ని డిమాండ్ చేసింది. ప్ర‌తి ఏటా 2 కోట్ల జాబ్స్ ఇస్తామ‌ని చెప్పార‌ని కానీ ప్ర‌తి సంవ‌త్స‌రం 2 ల‌క్ష‌ల మందిని ఉద్యోగాల‌లో తొల‌గిస్తూ వ‌చ్చార‌ని ఆరోపించింది. ప్రజాస్వామ్యం హ‌త్య‌కు గురవుతున్నా మౌన‌మే వ‌హించార‌ని ఎద్దేవా చేసింది. చైనా చొర‌బాట్ల‌కు దిగినా ప‌ట్టించు కోలేద‌ని మండిప‌డింది కాంగ్రెస్. ఈ మౌనం దేశ ప్ర‌జ‌లు మేల్కొనేంత సంద‌డిని సృష్టించింద‌ని పేర్కొంది.

Also Read : Visakhapatnam Port : స‌రుకు ర‌వాణాలో విశాఖ పోర్టు రికార్డ్

 

Leave A Reply

Your Email Id will not be published!