Police Raids Congress : పోలీసు దాడులు దారుణం – కాంగ్రెస్

సోషల్ మీడియా వింగ్ ఆఫీస్ పై దాడి

Police Raids Congress : త‌మ పార్టీకి చెందిన సోష‌ల్ మీడియా వింగ్ ఆఫీసుపై పోలీసులు దాడి(Police Raids Congress) చేయ‌డాన్ని తీవ్రంగా ఖండించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. నిన్న రాత్రి ఎలాంటి ముంద‌స్తు స‌మాచారం లేకుండా సోదాలు చేప‌ట్ట‌డంపై మండిప‌డ్డారు. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

త‌న అధికారం ఎక్క‌డ పోతుందేమోన‌న్న భ‌యంతో కేసీఆర్ ఇలాంటి దాడుల‌ను ప్రోత్స‌హిస్తున్నాడంటూ ఆరోపించారు. ఈ రాష్ట్రంలో ప్ర‌జాస్వామ్యం అనేది ఉందా అని ప్ర‌శ్నించారు. సిబ్బందిని, 50 కంప్యూట‌ర్ల‌ను తీసుకు వెళ్లార‌ని మండిప‌డ్డారు. రాబోయే రోజుల్లో ప్ర‌జ‌లు త‌గిన రీతిలో బుద్ది చెప్ప‌డం ఖాయ‌మ‌న్నారు. ఎవ‌రో ఫిర్యాదు చేస్తే దానికి ఆధారాలు ఉండాలి క‌దా అని నిల‌దీశారు రేవంత్ రెడ్డి.

ముంద‌స్తు స‌మాచారం లేకుండా ఎలా సోదాలు చేస్తారంటూ సీరియ‌స్ అయ్యారు. రాష్ట్రంలో పాల‌న లేద‌ని రాచ‌రిక పాల‌న సాగుతోంద‌న్నారు. మాజీ ఎంపీ మ‌ల్లు ర‌వి, మాజీ మంత్రి ష‌బ్బీర్ అలీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పోలీసులు అనుస‌రించిన తీరు దారుణంగా ఉంద‌ని ఆరోపించారు.

ఇదిలా ఉండ‌గా కాంగ్రెస్ పార్టీకి పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్ గా సునీల్ క‌నుగోలు ప‌ని చేస్తున్నారు. మాదాపూర్ ఇనార్బిట్ మాల్ సమీపంలో ఉన్న ఆఫీసు పై దాడి చేశారు పోలీసులు. సీఎం కేసీఆర్ కు, స‌ర్కార్ కు వ్య‌తిరేకంగా పోస్టులు పెడుతున్నార‌ని అందుకే దాడులు చేసిన‌ట్లు వెల్ల‌డించారు.

సెల్ ఫోన్లు స్విచ్ఛాఫ్ చేయించారు. కంప్యూట‌ర్లు, ల్యాప్ టాప్ లు స్వాధీనం చేసుకున్నారు. కాగా సునీల్ క‌నుగోలు టీం గ‌త కొంత కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం ప‌ని చేస్తోంది. త‌మ వ‌ద్ద ఐదారు ఎఫ్ఐఆర్ లు ఉన్నాయ‌ని , వాటి ఆధారంగా సోదాలు చేశామ‌న్నారు. ముంద‌స్తు స‌మాచారం ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు పోలీసులు.

Also Read : ‘జాగృతి’ అబ‌ద్దం క‌విత నాట‌కం – కొండా

Leave A Reply

Your Email Id will not be published!