Congress Slams : మోదీ ప్రభుత్వం అన్నింటా వైఫల్యం
నిప్పులు చెరిగిన కాంగ్రెస్ పార్టీ
Congress Slams : దేశంలో కొలువు తీరిన మోదీ భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వం ప్రజలకు ఉపయోగ పడిన దాఖలాలు లేవని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. స్వంత ప్రచారం తప్ప దేశానికి చేసింది ఏమీ లేదని పేర్కొంది. బడా బాబులకు, వ్యాపార వేత్తలకు, కార్పొరేట్ కంపెనీలకు దోచి పెట్టేందుకే తన సమయాన్ని కేటాయించారని ఆరోపించింది.
ఏ పార్టీకైనా అధికారంలోకి వస్తే కీలకమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఎక్కువ సమయం పడుతుంది. తొమ్మిదేళ్లవుతోంది మోదీ పీఎంగా వచ్చి. కానీ ఒక్కటైనా దేశానికి ఉపయోగకరమైన ప్రాజెక్టును నిర్మించారా అని ప్రశ్నించింది కాంగ్రెస్(Congress) పార్టీ. ఆయన తన పదవీ కాలంలో చరిత్రను చెరిపేసే ప్రయత్నం చేశారు. కులం , మతం, ప్రాంతం ప్రాతిపదికన జనాన్ని విభజించేందుకు యత్నించారంటూ ధ్వజమెత్తింది . ఒక్కటన్నా భారీ నీటి పారుదల ప్రాజెక్టలను నిర్మించారా అంటూ నిలదీసింది పార్టీ.
ముందు వెనుకా చూడకుండా వ్యాపారవేత్తలు, కంపెనీలకు లబ్ది చేకూర్చే ప్లాన్ లో భాగంగా సాగు చట్టాలను తీసుకు వచ్చారని, కానీ రైతుల పోరాటంతో దిగి వచ్చారంటూ ఎద్దేవా చేసింది. పోనీ ఏవైనా గుర్తు పెట్టుకునేలా విద్యా, రక్షణ, పరిశోధనా సంస్థలను ఏర్పాటు చేశారా అంటే అది కూడా లేదని ధ్వజమెత్తింది. చివరకు సాంప్రదాయ జనాభా గణనను నిర్వహించడంలో కూడా చేతులెత్తేశారంటూ మండిపడింది. ఇంకేం ముఖం పెట్టుకుని ఉత్సవాలు నిర్వహిస్తారంటూ ఎద్దేవా చేసింది.
Also Read : Hello AP Bye Bye YCP : హలో ఏపీ బై బై వైసీపీ – జనసేన