Congress Social Media : 6 రాష్ట్రాల ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్
సోషల్ మీడియా టీంతో చర్చలు
Congress Social Media : కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ మేరకు త్వరలో దేశంలోని 5 రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే పార్టీ కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. 224 సీట్లకు గాను 135 సీట్లను కైవసం చేసుకుంది. పవర్ లో ఉన్న బీజేపీ కేవలం 65 సీట్లకే పరిమితమైంది. దీంతో కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగింది.
కర్ణాటకలో గెలుపు వెనుక కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా(Congress Social Media) కీలకమైన పాత్ర పోషించింది. దీని వెనుక మాస్టర్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు ముఖ్య భూమిక పోషించారు. ప్రభుత్వం కొలువు తీరిన వెంటనే సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సునీల్ ను ప్రభుత్వ సలహాదారుగా నియమించారు.
ఇదిలా ఉండగా రాబోయే ఎన్నికల్లో పార్టీ సత్తా చాటేందుకు తీసుకోవాల్సిన చర్యలు, వ్యూహాల గురించి సోషల్ మీడియా బృందంతో ఏఐసీసీ ఆధ్వర్యంలో చర్చలు జరిగాయి. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ , కమ్యూనికేషన్ ఇంఛార్జ్ జైరామ్ రమేష్ , సోషల్ మీడియా అండ్ పబ్లిసిటీ ఇంఛార్జ్ పవన్ ఖేరా, డిజిటల్ ప్లాట్ ఫారమ్ ఇంఛార్జ్ సుప్రియా శ్రీనాటే పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వం వైఫల్యాలను ప్రధానంగా ఎత్తి చూపాలని ఈ సందర్బంగా పార్టీ నేతలు స్పష్టం చేశారు. మరింత ఉత్సుకతతో పని చేయాలని సూచించారు. పార్టీ పరంగా ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా అందజేస్తామని పేర్కొన్నారు.
Also Read : Dharmapuri Arvind : కేసీఆర్ చెప్పినట్లే రేవంత్ కామెంట్స్