MLA Kuldeep Bishnoi : కాంగ్రెస్ ఎమ్మెల్యే కుల్దీప్ పై వేటు
రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పర్యవసానం
MLA Kuldeep Bishnoi : రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడినందుకు గాను హర్యానాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్(MLA Kuldeep Bishnoi) పై వేటు వేసింది పార్టీ హైకమాండ్. పార్టీ రూల్స్ కు వ్యతిరేకంగా పాల్పడినందుకు చర్య తీసుకుంది.
పార్టీకి వ్యతిరేకంగా ఇతర పార్టీ అభ్యర్థికి మద్దతుగా ఓటు వేసినందుకు కుల్దీప్ బిష్ణోయ్ బహిష్కరణకు గురయ్యారు. ఈ క్రాస్ ఓటింగ్ తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న అజయ్ మాకెన్ ఓటమి పాలయ్యారు.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి ప్రత్యేక ఆహ్వానితుని పదవితో సహా అన్ని పార్టీ పదవుల నుంచి కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ శనివారం బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.
ఈ మేరకు సోనియా గాంధీ తరపున పార్టీ అధికారికంగా వెల్లడించింది. ప్రస్తుతం కుల్దీప్ బిష్ణోయ్(MLA Kuldeep Bishnoi) హర్యానా లోని అడంపూర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఇదే సమయంలో ఎమ్మెల్యే ఓటు చెల్లదని ప్రకటించారు. ఇదిలా ఉండగా హర్యానా నుండి రెండు రాజ్యసభ స్థానాలకు భారతీయ జనతా పార్టీకి చెందిన క్రిషన్ లాల్ పన్వార్ తో పాటు పార్టీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థి , మీడియా బేరన్ కార్తికేయ శర్మ ఎన్నికయ్యారు.
బిష్ణోయ్ పార్టీ అభ్యర్థి మాకెన్ కు ఓటు వేసేందుకు బదులుగా బీజేపీ , దాని మిత్రపక్షమైన జేజేపీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి గిన శర్మకు బిష్ణోయ్ ఓటు వేశారు.
ఇదిలా ఉండగా ఈనెల 10న నాలుగు రాష్ట్రాలు హర్యానా, మహారాష్ట్ర, రాజస్థాన్ , కర్ణాటకలో 16 రాజ్యసభ ఎంపీలకు ఎన్నికలు జరిగాయి.
Also Read : కాశ్మీరీ యూట్యూబర్ ఫైసల్ అరెస్ట్