Congress Tickets : కాంగ్రెస్ లో టికెట్ల పంచాయ‌తీ

స్క్రీనింగ్ క‌మిటీ స‌భ్యుల ఆందోళ‌న

Congress Tickets : హైద‌రాబాద్ – తెలంగాణ‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గనున్న నేప‌థ్యంలో తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ (టీపీసీసీ) లో టికెట్ల పంచాయ‌తీ కొన‌సాగుతోంది. అభ్య‌ర్థుల ఎంపిక‌కు సంబంధించి ఇప్ప‌టికే పార్టీ హైక‌మాండ్ స్క్రీనింగ్ క‌మిటీ ఏర్పాటు చేసింది.

Congress Tickets Issue Viral

ఈ సంద‌ర్భంగా గ‌త కొన్ని రోజుల నుంచి ఎవ‌రికి ఇవ్వాల‌నే దానిపై చ‌ర్చ‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఇంకా కొలిక్కి రాక పోవ‌డం, తాము సూచించిన అభ్య‌ర్థుల‌కు ఖ‌రారు కాక పోవ‌డం, బీసీల‌కు క‌నీసం 34 సీట్లు ఇవ్వ‌క పోవ‌డంపై పెద్ద ఎత్తున క‌మిటీ స‌భ్యులు, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) మ‌ధ్య వాదోప‌వాదాలు చోటు చేసుకున్నాయి.

దీంతో తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేస్తూ మ‌ధ్య‌లోనే వెళ్లి పోయారు. త‌మ‌కే సీట్లు అనుకున్న సీనియ‌ర్ల‌కు సైతం షాక్ త‌గ‌ల‌డంతో భ‌గ్గుమంటున్నారు. స్క్రీనింగ్ క‌మిటీ స‌భ్యులు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. తుది జాబితాపై రేవంత్ స‌భ్యులు తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. రేవంత్ రెడ్డి కావాల‌ని త‌మ‌కు ప్ర‌యారిటీ ఇవ్వ‌డం లేదంటూ వాపోయారు.

ఏఐసీసీ మాజీ చీఫ్ , వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ వ‌ద్ద‌నే తాము తేల్చుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు.

Also Read : Chandra Babu Naidu : చంద్ర‌బాబు బెయిల్ పై ఉత్కంఠ

Leave A Reply

Your Email Id will not be published!