Congress Tiranga March : కాంగ్రెస్ తిరంగా మార్చ్
అదానీపై జేపీసీ వేయండి
Congress Tiranga March : కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 13 విపక్ష పార్టీలు కలిసి గురువారం పార్లమెంట్ లో తిరంగా మార్చాను నిర్వహించారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, మాజీ చీఫ్ సోనియా గాంధీతో పాటు పలువురు ఎంపీలు ఈ మార్చ్(Congress Tiranga March) లో పాల్గొన్నారు. దేశంలో ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడిందన్నారు. అందుకే జాతీయ పతాకాన్ని తాము చేపట్టామన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే.
తాము మొదటి నుంచి ప్రధానమంత్రిని కోరుతున్నామని, వెంటనే జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేయాలని కానీ పట్టించు కోవడం లేదన్నారు. గౌతం అదానీపై జేపీసీని ఎందుకు ఏర్పాటు చేయడం లేదంటూ ప్రశ్నించారు. అసలు అదానీకి మోదీకి ఉన్న లోపాయికారి ఒప్పందం ఏమిటో దేశ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు సోనియా గాంధీ. కేంద్ర సర్కార్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
అంతకు ముందు లోక్ సభ స్పీకర్ టీ మీట్ కు ప్రతిపక్షాలను ఆహ్వానించారు. కానీ వారు వెళ్లలేదు. పార్లమెంట్ కు సంబంధించి గురువారం చివరి బడ్జెట్ సమావేశాలు ఉండడంతో ఆందోళన బాట పట్టారు ఎంపీలు. ఈ సందర్బంగా విపక్ష నేతలు పార్లమెంట్ నుంచి విజయ్ చౌక్ వరకు తిరంగా మార్చ్ చేపట్టారు.
విపక్ష సభ్యులు ప్ల కార్డులు, నినాదాలు చేయడంతో లోక్ సభ వాయిదా పడింది. ఇదే అంశంపై విపక్ష సభ్యుల ఆందోళనలతో రాజ్యసభ కూడా వాయిదా పడింది. ఇక కాంగ్రెస్ పార్టీ(Congress Party) చేపట్టిన తిరంగా మార్చ్ లో డీఎంకే, సమాజ్ వాదీ పార్టీ, ఆర్జేడీ, ఎన్సీపీ, వామపక్షాలు, భావ సారూప్యత కలిగిన పార్టీలు మార్చ్ లో పాల్గొన్నాయి.
Also Read : స్పీకర్ టీ మీట్ బహిష్కరణ