TS Congress : అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ వాకౌట్

రాజ్యాంగ స్పూర్తికి విరుద్దం

TS Congress : అంతా అనుకున్న‌ట్టే జ‌రిగింది. ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ఓ వైపు ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్ కు అడ్డు త‌గులుతున్నారంటూ భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ర‌ఘునంద‌న్ రావు,

ఈట‌ల రాజేంద‌ర్, టి. రాజా సింగ్ ల‌ను స‌మ‌వేశాలు ముగిసేంత దాకా స‌స్పెన్ష‌న్ వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు స్పీక‌ర్ పోచారం శ్రీ‌నివాస్ రెడ్డి.

మంత్రి త‌ల‌సాని ప్ర‌తిపాద‌న‌ల‌కు అంతా ఓకే చెప్ప‌డంతో క‌థ ముగిసింది. ఇక ఈ నిర్ణ‌యాన్ని నిర‌సిస్తూ ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ధ‌ర్నాకు దిగారు.

ఇక కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఆర్థిక మంత్రి హ‌రీశ్ రావు ప్రవేశ పెట్టిన బ‌డ్జెట్ అంతా గొప్ప‌లు త‌ప్ప ప్ర‌జ‌ల‌కు ఒరిగేది ఏమీ లేదంటూ ఆరోపించింది. ఈ మేర‌కు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.

సీఎల్పీ లీడ‌ర్ భ‌ట్టి విక్ర‌మార్క‌, ఎమ్మెల్యేలు శ్రీ‌ధ‌ర్ బాబు, జ‌గ్గారెడ్డి, కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి, సీతక్క‌, వీర‌య్య బ‌డ్జెట్ స‌మావేశాల‌ను(TS Congress) బ‌హిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా వారు మీడియాతో మాట్లాడారు.

బ‌డ్జెట్ స‌మావేశాల‌ను పార‌ద‌ర్శ‌కంగా నిర్వ‌హించ లేద‌ని ఆరోపించారు. భార‌త రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు. ప్ర‌తిప‌క్ష స‌భ్యుల‌కు మైక్ అనేది ఇవ్వ‌కుండానే స్పీక‌ర్ పోచారం శ్రీ‌నివాస్ రెడ్డి ప‌క్ష‌పాత ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

స‌భ‌లో క‌నీస గౌర‌వ మ‌ర్యాద‌లు లేకుండా స‌భ్యుల ప‌ట్ల అమార్య‌ద పూర్వ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. పాయింట్ ఆఫ్ ఆర్డ‌ర్ అన్న‌దే లేకుండా చేసిన ఘ‌న‌త కేసీఆర్ ప్ర‌భుత్వానికి ద‌క్కుతుంద‌న్నారు.

Also Read : తెలంగాణ ప్ర‌భుత్వం సంక్షేమ‌ జ‌పం

Leave A Reply

Your Email Id will not be published!