Veerappa Moily : కన్నడ నాట కాంగ్రెస్ గాలి – మొయిలీ
కాంగ్రెస్ సీనియర్ నేత కామెంట్స్
Veerappa Moily : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ(Veerappa Moily) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే మే నెల 10న పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో పాటు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోటీ నెలకొంది. మొత్తం 224 సీట్లకు గాను తమ పార్టీకి 130కి పైగా సీట్లు వస్తాయని జోష్యం చెప్పారు వీరప్ప మొయిలీ. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈసారి ప్రజలు మార్పును కోరుకుంటున్నారని , ఈసారి కాంగ్రెస్ గాలి వీస్తోందని చెప్పారు వీరప్ప మొయిలీ. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కర్ణాటక ఎప్పుడూ కీలక పాత్ర పోషిస్తూ వస్తోందన్నారు. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ , దాని అనుబంధ పార్టీలతో కూడిన యూపీఏ సర్కార్ రానుందన్నారు. ఈ శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి 60 సీట్ల కంటే ఎక్కువ రావని పేర్కొన్నారు వీరప్ప మొయిలీ(Veerappa Moily).
జనతాదళ్ (సెక్యులర్) బీజేపీతో కుమ్మక్కయిందని హెచ్ డీ దేవెగౌడ అవకాశవాద రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారంటూ ఆరోపించారు. బీజేపీలో ప్రజాస్వామ్యం లేదని తేలి పోయిందన్నారు. పార్టీ కోసం కష్ట పడిన వారిని తాము ప్రోత్సహిస్తున్నామని కానీ బీజేపీ వారిని పక్కన పెట్టిందని ఎద్దేవా చేశారు వీరప్ప మొయిలీ.
Also Read : కేజ్రీవాల్ ఎవరికీ తలవంచడు – ఎంపీ