Congress Win : తెలంగాణలో హస్తం హవా
పోల్ ట్రాకర్ సర్వేలో వెల్లడి
Congress Win : హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో సర్వే సంస్థల ముందస్తు అంచనా ఫలితాలు మరింత ఆసక్తిని కలిగించేలా చేస్తున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన పలు సర్వే సంస్థలలో అత్యధికంగా కాంగ్రెస్(Congress) పార్టీ గెలవ బోతోందంటూ ప్రకటించాయి. ఇంకొన్ని సర్వేలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిపాయి.
Congress Win Viral
తాజాగా పోల్ ట్రాకర్ సంస్థ సర్వే రిజల్ట్స్ డిక్లేర్ చేసింది. ఈ ఏడాదిలో జరుగుతున్న 119 సీట్లకు గాను కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లను కైవసం చేసుకుంటుందని పేర్కొంది. ఆ పార్టీకి 59 సీట్ల నుంచి 69 సీట్లు వస్తాయని అంచనా వేసింది.
ఈసారి అధికారంలో కొలువు తీరిన బీఆర్ఎస్ పార్టీపై తీవ్రమైన వ్యతిరేకత ఉందని , ఇది ఆ పార్టీకి షాక్ తగలనుందని స్పష్టం చేసింది. గులాబీ పార్టీకి 39 సీట్ల నుంచి 43 సీట్లు రానున్నాయని పోల్ ట్రాకర్ వెల్లడించింది.
ఇక భారతీయ జనతా పార్టీకి కేవలం 4 నుంచి 5 సీట్లు వస్తాయని తెలిపింది. విచిత్రం ఏమిటంటే ఎంఐఎం పార్టీకి 2 నుంచి 5 సీట్లకే పరిమితం అవుతుందని జోష్యం చెప్పింది. ఇది ఊహించని షాక్. ఇండిపెండెంట్లు 3 నుంచి 6 సీట్లు వస్తాయని అంచనా వేసింది.
Also Read : Minister KTR : చరిత్రను మలుపు తిప్పిన దీక్ష