Conrad Sangma Kiren Rijiju : రిజిజుతో సీఎం సంగ్మా భేటీ

కీల‌క అంశాల‌పై చ‌ర్చించిన మంత్రి సీఎం

Conrad Sangma Kiren Rijiju : కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజుతో మేఘాల‌య సీఎం కాన్రాడ్ సంగ్మా సోమ‌వారం భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఇద్ద‌రూ కీల‌క అంశాల‌పై చ‌ర్చించారు. ఇద్ద‌రికీ మంచి ఫాలోయింగ్ ఉంది ఈశాన్య ప్రాంతంలో. నేష‌న‌ల్ పీపుల్స్ పార్టీ చీఫ్ గా కాన్రాడ్ సంగ్మా మేఘాల‌య రాష్ట్రానికి రెండోసారి సీఎంగా కొలువు తీరారు. తాజాగా రాష్ట్రంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించింది. ఎన్పీపీకి 26 సీట్లు వ‌చ్చాయి. ఎన్నిక‌ల కంటే ముందు భార‌తీయ జ‌న‌తా పార్టీ , కాన్రాడ్ సంగ్మా(Conrad Sangma) క‌లిసి ప్ర‌భుత్వంలో ఉన్నారు.

కానీ ఎందుక‌నో బీజేపీ బ‌య‌ట‌కు వ‌చ్చింది. సీఎం సంగ్మాపై నిప్పులు చెరిగింది. అంతులేని రీతిలో అవినీతి, అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డారంటూ ఆరోపించింది. చివ‌ర‌కు ఒంట‌రిగానే పోటీ చేశాయి ఈసారి ఎన్నిక‌ల్లో ఎన్పీపీ, బీజేపీ. కానీ ఊహించ‌ని రీతిలో అతి పెద్ద పార్టీగా ఎన్పీపీ నిలిచింది. ఇదే స‌మ‌యంలో మ‌రోసారి బీజేపీతో చేతులు క‌లిపారు కాన్రాడ్ సంగ్మా. మిత్ర భేదం మ‌రిచి పోకూడ‌ద‌ని , ఎలాగైనా స‌రే మేఘాల‌యలో క‌లిసే రెండోసారి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాల‌ని చ‌క్రం తిప్పారు.

ఆ మేర‌కు సీరియ‌స్ గా ప్ర‌య‌త్నం చేశారు అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ‌. సీఎం కాన్రాడ్ సంగ్మాను తిరిగి బీజేపీతో చేతులు క‌లిపేలా చేయ‌డంలో స‌క్సెస్ అయ్యారు. దీంతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఓకే చెప్పారు. మేఘాల‌య రాష్ట్రంలో సీఎం ప్ర‌మాణ స్వీకార మ‌హోత్స‌వానికి దేశ ప్ర‌ధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు అమిత్ షా హాజ‌ర‌య్యారు. ఇదిలా ఉండ‌గా రెండోసారిగా సీఎంగా కొలువు తీరిన కాన్రాడ్ సంగ్మాను ప్ర‌త్యేకంగా అభినందించారు కిరెన్ రిజిజు(Conrad Sangma Kiren Rijiju).

Also Read : స్వ‌లింగ వివాహాల‌పై రిజిజు కామెంట్స్

Leave A Reply

Your Email Id will not be published!