Conrad Sangma : కాన్రాడ్ సంగ్మా షాకింగ్ కామెంట్స్
మేఘాలయంలో టీఎంసీ కీ రోల్
Conrad Sangma Exit Polls : ఈశాన్య ప్రాంతంలో జరిగిన ఎన్నికల్లో త్రిపుర, నాగాలాండ్ రాష్ట్రాలలో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రాబోతోందంటూ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఇండియా టుడే, జీటీవీ ప్రకటించిన వాటిలో కాషాయ పార్టీ మరోసారి తన సత్తా చాట బోతోందంటూ ప్రకటించాయి. కానీ మేఘాలయలో మాత్రం హంగ్ రాబోతోందంటూ పేర్కొన్నాయి. దీంతో ప్రస్తుతం సీఎంగా ఉన్న కాన్రాడ్ సంగ్మా డైలమాలో పడ్డారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
ఒక్కోసారి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పవచ్చని కూడా అన్నారు. ఒకవేళ అవే గనుక నిజమైతే బీజేపీతో పొత్తు ఉంటుందా అన్న దానిపై క్లారిటీ ఇవ్వలేక పోయారు. విచిత్రం ఏమిటంటే త్రిపుర, నాగాలాండ్ లలో అధికారాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మెజారిటీ కంటే ఎక్కువ సీట్లు బీజేపీ కైవసం చేసుకోనుంది. కానీ మేఘాలయలో ఈసారి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కింగ్ మేకర్ గా మారనుంది.
అయితే నేషనల్ పీపుల్స్ పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరించనుంది. ఈశాన్య రాష్ట్రాలకు వాయిస్ ఇవ్వగలిగే పార్టీలతో సంప్రదింపులు జరపాల్సిన అవసరం రావచ్చని అభిప్రాయపడ్డారు సీఎం కాన్రాడ్ సంగ్మా(Conrad Sangma Exit Polls) . ఆ దిశగా కృషి చేస్తున్నామని చెప్పారు. మంగళవారం ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. 60 మంది సీట్లు కలిగిన రాష్ట్రంలో 31 కంటే తక్కువ రానుండడంతో ఇక్కడ కాంగ్రెస్, టీఎంసీ సభ్యులే కీలకం కానున్నారు. కాంగ్రెస్ 6, టీఎంసీ 11 సీట్లు గెలిచే ఛాన్స్ ఉందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి.
Also Read : మేఘాలయలో టీఎంసీ కింగ్ మేకర్