Manoj Tiwari : ఓట్ల తొలగింపులో ఆప్ సర్కార్ కుట్ర
ఎంపీ మనోజ్ తివారీ షాకింగ్ కామెంట్స్
Manoj Tiwari : దేశ రాజధాని ఢిల్లీలో మహానగర ఎన్నికల పోలింగ్ లో ఆప్ సర్కార్ కుట్రకు తెర లేపిందంటూ భారతీయ జనతా పార్టీ ఎంపీ మనోజ్ తివారీ ఆరోపించారు. 250 వార్డులలో 1,349 మంది బరిలో ఉన్నారు. చాలా మంది ప్రముఖుల పేర్లు గల్లంతయ్యాయి. విచిత్రం ఏమిటంటే ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ అనిల్ చౌదరి తన ఓటు జాబితాలో లేదంటూ వాపోయారు.
దీనిపై తాను ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 450 పేర్లు తొలగించారంటూ ధ్వజమెత్తారు ఎంపీ మనోజ్ తివారీ. ఆదివారం ఎంపీ మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలోని సుభాష్ మొహల్లా వార్డులో గంప గుత్తగా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారని దీనిని దృష్టిలో పెట్టుకుని ఆప్ ఓ ఓట్లను గుర్తించి జాబితా నుంచి తీసి వేయించిందంటూ మండిపడ్డారు.
ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ వార్డులో ఎన్నికలను రద్దు చేయాలని తిరిగి ఎన్నికలు నిర్వహించాలని అన్నారు మనోజ్ తివారి(Manoj Tiwari). ఇది కావాలని ఢిల్లీ ప్రభుత్వం పన్నిన కుట్రగా పేర్కొన్నారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు మనోజ్ తివారీ.
ఇదిలా ఉండగా భారతీయ జనతా పార్టీనే కావాలని ఓటర్లను తొలగించేలా చేసిందంటూ ఆప్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆరోపించారు. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడంతోనే సరి పోయింది. ఈ ఎన్నికలలో కోటి 45 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించు కోనున్నారు.
Also Read : ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ ఓటు గల్లంతు