Randeep Surjewala : మల్లికార్జున్ ఖర్గే హత్యకు కుట్ర
కాంగ్రెస్ ఆరోపణల్ని ఖండించిన బీజేపీ
Randeep Surjewala : కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంటున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే హత్యకు కుట్ర పన్నారంటూ మండిపడింది. కాంగ్రెస్ చేసిన కామెంట్స్ పై తీవ్ర స్థాయిలో మండిపడింది భారతీయ జనతా పార్టీ. ఖర్గే హత్యకు కుట్ర అనేది శుద్ద అబద్దమని, ఇది కేవలం ప్రచారంలో ఒక భాగమని ఆరోపించారు కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మై.
దీనిపై పూర్తిగా విచారణ చేపడతామని ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ తన ప్రచారంలో దీనిని కూడా ఒక ప్రచార అస్త్రంగా వాడుకోవాలని చూస్తుందని ఆరోపించారు సీఎం. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఖర్గే , ఆయన భార్య కుటుంబ సభ్యులందరినీ బీజేపీ అభ్యర్థి చంపేందుకు ప్లాన్ చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి , కర్ణాటక రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ రణదీప్ సూర్జేవాలా(Randeep Surjewala).
వచ్చే వారం ఎన్నికలకు కొన్ని రోజుల ముందు జరిగిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నేత ఆడియో రికార్డింగ్ ను ప్లే చేశాడు. ఇందులో కలబురగి జిల్లా లోని చిత్తాపూర్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థి మణికంఠ రాథోడ్ ఖర్గే లేపేస్తానంటూ అన్నట్లు ఇందులో ఉన్న విషయాన్ని తెలిపాడు.
Also Read : కన్నడ నాట మోదీకి బ్రహ్మరథం