Punjab Aap Mla’s : పంజాబ్ స‌ర్కార్ కూల్చేందుకు కుట్ర

ఆప్ ఎమ్మెల్యేల సంచ‌ల‌న వాంగ్మూలం

Punjab Aap Mla’s : ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు సంచ‌ల‌న వాంగ్మూలం ఇవ్వ‌డం క‌ల‌క‌లం రేపింది. పంజాబ్ రాష్ట్రంలో కొలువు తీరిన ఆప్ ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర ప‌న్నిందంటూ ఆరోపించింది. రాష్ట్ర విజిలెన్స్ ఎదుట పార్టీకి చెందిన ఏడుగురు ప్ర‌జా ప్ర‌తినిధులు వాంగ్మూలం ఇచ్చారు.

దేశంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ కొలువు తీరాక ఎనిమిదేళ్ల కాలంలో బీజేపీయేత‌ర ఎనిమిది రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను కూల్చి వేసింది. తాజాగా మహారాష్ట్ర‌లో మ‌హా వికాస్ అఘాడీని కూల్చేసింది స‌ర్కార్. శివ‌సేన తిరుగుబాటు ప్ర‌క‌టించిన షిండేకు స‌పోర్ట్ గా బీజేపీ సంకీర్ణ స‌ర్కార్ ను ఏర్పాటు చేసింది.

సేమ్ ఇదే ప్లాన్ ను జార్ఖండ్ లో ప్ర‌యోగించింది. కానీ బీజేపీ చేసిన దుష్ట ప‌న్నాగం వ‌ర్క‌వుట్ కాలేదు. హేమంత్ సోరేన్ ముందుగానే ప‌సిగ‌ట్టి కోలుకోలేని షాక్ ఇచ్చారు. పంజాబ్ లో కూడా లోట‌స్ ప్లాన్ చేశార‌నే ఆరోప‌ణ‌లున్నాయి. ఇప్ప‌టికే ఇద్ద‌రు ఆప్ ఎమ్మెల్యేలు విజిలెన్స్ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు.

ఇవాళ అక్టోబ‌ర్ 5న బుధ‌వారం ఏడుగురు ఎమ్మెల్యేలు వాంగ్మూలం ఇవ్వ‌డం క‌ల‌క‌లం రేపింది. ఆప్ ఎమ్మెల్యేలు(Punjab Aap Mla’s)  అంగుర‌ల్ , రామ‌న్ అరోరా త‌మ‌పై బీజేపీ ప్రలోభాల‌కు గురి చేసింద‌ని ఆరోపించారు. ఇందుకు సంబంధించి ఎమ్మెల్యేలు డీజీపీ గౌత‌మ్ యాద‌వ్ కు ఫిర్యాదు చేశారు.

ఈ మొత్తం ఘ‌ట‌న‌పై పంజాబ్ ప్ర‌భుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. తాజాగా ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల‌లో జై కిష‌న్ రోడి, రూపింద‌ర్ హ్యాపీ, బుద్రామ్ , కుల్జీత్ సింగ్ రంధావా, మంజిత్ సింగ్ బిలాస్ పూర్, దినేష్ చ‌ద్దా, మాస్ట‌ర్ జ‌గ్సీర్ సింగ్ వాంగ్మూలం ఇచ్చారు.

Also Read : మాజీ సీఎం గృహ నిర్బంధం

Leave A Reply

Your Email Id will not be published!