Tejashwi Yadav : భార‌త రాజ్యాంగం ప‌విత్ర గ్రంథం

డిప్యూటీ సీఎం తేజ‌స్వి యాద‌వ్

Tejashwi Yadav : బీహార్ ఉప ముఖ్య‌మంత్రి తేజ‌స్వి యాద‌వ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు రాజ్యాంగంపై. దేశంలోని ప్ర‌జ‌లంద‌రికే కాదు దేశానికి సంబంధించినంత వ‌ర‌కు భార‌త రాజ్యాంగం ప‌విత్ర గ్రంథం అని అన్నారు. ఆర్జేడీ నాయ‌కుడు, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి చంద్ర‌శేఖ‌ర్ చేసిన రామ్ చ‌రిత్ మాన‌స్ గురించి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపాయి.

తేజ‌స్వి యాద‌వ్ ఇవాళ ఆర్జేడీ నాయ‌కుల‌కు, ఆయ‌న బాస్ సీఎం నితీశ్ కుమార్ మ‌ధ్య ఇటీవ‌ల జ‌రిగిన గొడ‌వ‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మీడియాపై సీరియ‌స్ అయ్యారు డిప్యూటీ సీఎం. మీరు చెప్పండి..మీ సంస్థ‌ల‌లో ఏ లైన్ తీసుకోవాలో ఎడిట‌ర్లు నిర్ణ‌యిస్తారా లేదా రిపోర్డర్లు ఎడిట‌ర్ల‌కు ఏమి చెప్పాలో చెప్పాల‌ని ప్ర‌శ్నించారు.

ఆర్జీడే నాయ‌కుడు మీడియా ప్ర‌శ్న‌ల‌కు శ్రేష్ట‌మైన ప్ర‌శ్నార్థ‌కంగా మారారు తేజ‌స్వి యాద‌వ్(Tejashwi Yadav). ఆరు నెల‌ల కింద‌టే మిత్ర‌ప‌క్షాలుగా మారిన మాజీ ప్ర‌త్య‌ర్థులైన ఆర్జేడీ, జేడీయూ ఢీకొన్న‌ట్లుగా క‌నిపిస్తున్నాయి. ఈ స‌మ‌స్య‌ను త‌న స్వంత ప్ర‌యోజ‌నం కోసం , మంత్రిపై అత‌ని పార్టీ ద్వారా చ‌ర్య‌కు అనుకూలంగా ఉప‌యోగించు కోవడం ప‌ట్ల రాద్దాంతం చోటు చేసుకుంది.

సంకీర్ణ భాగస్వామి సూచ‌న‌ల‌ను ఆర్జేడీలో ఉన్న వారు ప‌ట్టించుకోలేదు. త‌న తండ్రి ఆర్జేడీ చీఫ్ లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ , సీఎం నితీశ్ కుమార్ మ‌ధ్య మంచి అవ‌గాహ‌న ఉంద‌న్నారు వీరిద్ద‌రూ మ‌హా ఘ‌ట్ బంధ‌న్ లో కీల‌క‌మైన నాయ‌కులు అని స్ప‌ష్టం చేశారు తేజ‌స్వి యాద‌వ్ .

రాజ్యాంగం అన్ని మ‌తాల‌ను స‌మానంగా గౌర‌వించాల‌ని పిలుపు ఇచ్చింద‌న్నారు.

Also Read : మ‌త మార్పిడి చ‌ట్టం’పై తీర్పు వ‌ద్దు

Leave A Reply

Your Email Id will not be published!