DK Shiva Kumar : డీకేతో ఇజ్రాయెల్ కాన్సుల్ జనరల్ భేటీ
మర్యాద పూర్వకంగా కలిసందన్న డిప్యూటీ సీఎం
DK Shiva Kumar : కర్ణాటక – దక్షిణ భారత దేశానికి ఇజ్రాయెల్ కాన్సుల్ జనరల్ తమ్మీ బెన్ హైమ్ శనివారం మర్యాద పూర్వకంగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(DK Shiva Kumar) ను కలుసుకున్నారు. ఇందుకు సంబంధించి డీకే ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా ఉన్నాయి.
DK Shiva Kumar Met Israel Council
ఇజ్రాయెల్ లో పబ్లిక్ డిప్లమసీ హెడ్ గా పని చేశారు. తనను కలుసు కోవడం ఆనందంగా ఉందన్నారు ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం. రాష్ట్రానికి సంబంధించి కీలకమైన అంశాల గురించి తామిద్దరి మధ్య చర్చకు వచ్చాయని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా డీకే ప్రస్తుతం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. తెలంగాణలో ఎన్నికల పోలింగ్ కు సంబంధించి ఆదివారం ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. రేపు 11 గంటల వరకు ఏ పార్టీ మెజారిటీకి వస్తుందో పూర్తిగా తేలనుంది.
ప్రస్తుతం ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని ప్రకటించాయి. రాష్ట్రంలో మొత్తం 119 నియోజకవర్గాలు ఉన్నాయి. అభ్యర్థులు బయటకు వెళ్లకుండా అత్యంత కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేశారు.
Also Read : Sanju Samson : ఎట్టకేలకు శాంసన్ కు ఛాన్స్