Contract Out Sourcing : కాంట్రాక్టు..ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఫైర్
పట్టించుకోని కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం
Contract Out Sourcing : హైదరాబాద్ – గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో వివిధ శాఖలలో వెట్టి చాకిరి చేస్తూ వున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్దతిన పని చేస్తున్న ఉద్యోగుల గురించి ఊసు లేకుండా పోవడంపై నిరసన వ్యక్తం అవుతోంది. ఇది పూర్తిగా ఎన్నికల జిమ్మిక్కుగా పేర్కొంటున్నారు. మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉన్న దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రధాన సమస్యలపై, అంశాలపై దృష్టి పెట్టక పోవడం విడ్డూరంగా ఉందని వాపోతున్నారు బాధితులు.
Contract Out Sourcing Employees Issue
తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషిస్తూ వచ్చిన తమను సీఎం కేసీఆర్ నమ్మించి మోసం చేశాడని, కానీ ఇవాళ ఎన్నికలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో తమను పట్టించు కోక పోవడం దారుణమన్నారు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు.
రెండు రంగాలలో 50 వేల మందికి పైగా పని చేస్తున్నారు. వారిని పర్మినెంట్ చేస్తామని గత ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చాడని, దానిని మరిచి పోయాడని కానీ కాంగ్రెస్(Congress) పార్టీ విస్మరించడం విడ్డూరంగా ఉందని వాపోతున్నారు.
తమ కుటుంబాలకు చెందిన వారు కనీసం 2 నుంచి 3 లక్షల మంది ఓటర్లు ఉంటారని తాము ఏ పార్టీని నమ్మే పరిస్థితిలో లేమన్నారు. అణగారిన వర్గాల పేరుతో మోసం చేసిందంటూ ఆవేదన చెందుతున్నారు.
Also Read : Congress Manifesto 2023 : ఆరు నెలల్లో మెగా డీఎస్సీ