Biden Saudi Prince : ఖ‌షోగ్గీ హ‌త్య‌పై రాజుకున్న వివాదం

బైడెన్ ..ప్రిన్స్ యువ‌రాజు మ‌ధ్య అగాధం

Biden Saudi Prince : ప్ర‌పంచంలో అమెరికా ఎక్క‌డ కాలు మోపితే అక్క‌డ అదో సంచ‌ల‌నం. ఏ దేశం సుర‌క్షితంగా , ప్ర‌శాంతంగా ఉండ కూడ‌దు ఆ దేశం ఉద్దేశం. తాజాగా జ‌ర్న‌లిస్ట్ జ‌మాల్ ఖ‌షోగ్గీ 2018లో కిరాత‌కంగా హ‌త్యకు గుర‌య్యాడు.

దీని వెనుక ప్ర‌స్తుతం యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ (యూఏఈ) యువ రాజు హ‌స్తం ఉందంటూ ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దానిని ఆయ‌న ఖండించారు. ఇదే స‌మ‌యంలో ప్రెసిడెంట్ జోసెఫ్ బైడెన్ సౌదీ(Biden Saudi Prince) అరేబియాలో కాలు మోపాడు.

ప్రెసిడెంట్ వ‌స్తూనే ఖ‌షోగ్గీ హ‌త్య‌ను తెర ముందుకు తీసుకు వ‌చ్చారు. దీంతో మ‌రోసారి ప్ర‌పంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

ఇదే స‌మ‌యంలో నిర్వ‌హించిన ప్రెస్ మీట్ లో అంత‌ర్జాతీయ మీడియా సంస్థ ప్ర‌తినిధి ప్రెస్ మీట్ లో ఖషోగ్గీ హ‌త్య‌తో మీకు సంబంధం లేదా అంటూ నిల‌దీసినంత ప‌ని చేశారు.

ఈ సంద‌ర్భంగా యువ రాజు ఎలాంటి కామెంట్ చేయ‌కుండానే న‌వ్వ‌డం క‌ల‌క‌లం రేగింది. ఆయ‌న న‌వ్వారంటే దాని వెనుక ఉన్నార‌నే అర్థం ఉందంటూ మ‌రికొన్ని మీడియా సంస్థ‌లు ఆస‌క్తిక‌ర క‌థ‌నాలు, వ్యాఖ్యానాలు చేశాయి.

ఇదే స‌మ‌యంలో బైడెన్ కూడా మ‌రోసారి ఖ‌షోగ్గీ హ‌త్యోదంతంను ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించ‌డం తీవ్ర చ‌ర్చ‌కు దారి తీసింది.

కాగా తాను, యువ‌రాజు మ‌ధ్య జ‌రిగిన చ‌ర్చ‌ల‌లో విదేశాంగ వ్య‌వ‌హారాల స‌హాయ మంత్రి అడెల్ అల్ జుబేర్ నిజం చెప్ప‌డం లేన‌ట్టు క‌నిపించిందంటూ కామెంట్ చేశారు బైడెన్.

కాగా ఖ‌షోగ్గీని చంపేందుకు యువ‌రాజు ఆదేశించిన‌ట్లు అమెరికా నిఘా సంస్థ‌లు భావిస్తున్నాయి.

Also Read : సౌదీలో హ‌క్కుల ఉల్లంఘ‌న‌పై ఆందోళ‌న

Leave A Reply

Your Email Id will not be published!