ASI Gopal Das Detained : మంత్రిపై కాల్పులు..ఏఎస్ఐ అరెస్ట్
ఒడిశా సీఎం సీరియస్..పరిస్థితిపై ఆరా
ASI Gopal Das Detained : ప్రశాంతంగా ఉన్న ఒడిశా రాష్ట్రంలో ఒక్కసారిగా కాల్పుల ఘటన కలకలం రేగింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కిషోర్ దాస్ ఓ కార్యక్రమానికి హాజరవుతుండగా అసిస్టెంట్ సబ్ ఇన్స్ పెక్టర్ (ఏఎస్ఐ) గోపాల్ దాస్ కాల్పులకు తెగబడ్డాడు. రెండు రౌండ్లు కాల్పులు జరపడంతో ఉన్నట్టుండి కుప్ప కూలాడు మంత్రి.
హుటా హుటిన చికిత్స నిమిత్తం ప్రత్యేక విమానంలో భువనేశ్వర్ కు తరలించారు కిషోర్ దాస్ ను. ఈ కాల్పుల ఘటన ఆదివారం చోటు చేసుకుంది. బ్రజ్ రాజజ్ నగర్ లోని గాంధీ చౌక్ లో కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చారు ఆరోగ్య శాఖ మంత్రి కిషోర్ దాస్ . దాస్ వాహనం నుంచి దిగుతుండగా కాల్పులకు తెగబడటం కలకలం రేపింది.
మంత్రిపై కాల్పులకు పాల్పడిన ఏఎస్ఐ గోపాల్ దాస్ ను (ASI Gopal Das)పారి పోతుండగా పట్టుకున్నారు పోలీసులు. ఎందుకు కాల్పులు జరిపాడనే దానిపై ఆరా తీస్తున్నారు. కాల్పుల ఘటన జరిగిన వెంటనే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సీరియస్ గా స్పందించారు. మంత్రి కిషోర్ దాస్ ఆరోగ్యంపై ఆరా తీశారు.
మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు సీఎం. దాస్ పరిస్థితి విషమంగా ఉందని , ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు నవీన్ పట్నాయక్ కు. కార్యక్రమానికి మంత్రి రాగానే ఘన స్వాగతం పలికారు అక్కడి వారు. ఆ వెంటనే తూటాల శబ్దం వినిపించిందని స్థానికులు తెలిపారు.
క్రైమ్ బ్రాంచ్ విచారణ చేపట్టాలని ఆదేశించారు సీఎం. అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.
Also Read : ఒడిశా మంత్రిపై ఏఎస్ఐ కాల్పులు