Covid-19 : కలవర పెడుతున్న కరోనా కేసులు
అప్రమత్తం చేసిన కేంద్ర ప్రభుత్వం
Covid-19 : నిన్న మొన్నటి దాకా తగ్గుముఖం పట్టిన కరోనా ఉన్నట్టుండి పంజా విసురుతోంది. నిన్న 48 మంది కరోనా దెబ్బకు ప్రాణాలు కోల్పోయారు.
ఇవాళ కరోనా మహమ్మారి కాటుకు గత 24 గంటల్లో 41 మంది చని పోయారు. కొత్తగా 14,092 కరోనా(Covid-19) కేసులు నమోదయ్యాయి. కాగా రికవరీ రేటు 98.54 శాతంగా ఉందని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఇక మొత్తంగా కరోనా కేసుల సంఖ్య ఇప్పటి వరకు 4,42,53,464 కి చేరుకున్నాయి. తాజా కేసులు 1,16,861కి తగ్గాయని తెలిపింది. ఇక ఇవాల్టితో చోటు చేసుకున్న 41 మరణాలతో కలుపుకుంటే మొత్తం ఇప్పటి వరకు దేశంలో 5,27,037కి చేరుకుంది.
ఒక్క కేరళలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్ కేసులు 0.26 శాతం ఉండగా రికవరీ రేటు 98 కి పైగా ఉండడం విశేషం. దీంతో కేంద్ర ప్రభుత్వం కేసులు పెరుగుతుండడంతో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది.
ఇప్పటి వరకు రెండు డోసులు వ్యాక్సిన్లు తీసుకున్న వారు మూడో డోసు (బూస్టర్ డోసు) తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు వాక్సిన్ డ్రైవ్ ను ప్రారంభించింది.
ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచినట్లు కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
ఇక ప్రతి ఒక్కరు మాస్క్ లు ధరించాల్సిందేనంటూ తాజాగా పంజాబ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎవరు మాస్క్ వాడక పోయినా జరిమానా విధిస్తామంటూ హెచ్చరించింది. ఈ ఏడాది 2022 జనవరి 25 నాటికి దేశంలో నాలుగు కోట్ల మార్కును దాటింది.
Also Read : జెండాలు ఎగరేసిన సినీ ప్రముఖులు