#CoronaEffect : క‌రోనా క‌ల‌క‌క‌లం..బంధాలు ప‌టిష్టం

విచ్ఛిన్న‌మైన భార‌తీయ కుటుంబ వ్య‌వ‌స్థ క‌రోనా వైర‌స్ వ్యాధి పుణ్య‌మా అని మ‌ళ్లీ ఒక్క‌ట‌వుతున్నాయి. నిన్న‌టి దాకా పాశ్యాత్య పోక‌డ‌ల‌కు అల‌వాటు ప‌డిన జ‌న‌మంతా మ‌ళ్లీ పాతకాల‌పు నాటి జ్ఞాప‌కాల‌ను నెమ‌రు వేసుకుంటున్నారు. ఒక‌రిపై మ‌రొక‌రు మ‌మ‌కారాన్ని పెంచుకుంటూనే కోల్పోయినవ‌న్నీ తిరిగి తెచ్చుకునేందుకు తంటాలు ప‌డుతున్నారు. ఇది ఒకందుకు మంచిదే.

విచ్ఛిన్న‌మైన భార‌తీయ కుటుంబ వ్య‌వ‌స్థ క‌రోనా వైర‌స్ వ్యాధి పుణ్య‌మా అని మ‌ళ్లీ ఒక్క‌ట‌వుతున్నాయి. నిన్న‌టి దాకా పాశ్యాత్య పోక‌డ‌ల‌కు అల‌వాటు ప‌డిన జ‌న‌మంతా మ‌ళ్లీ పాతకాల‌పు నాటి జ్ఞాప‌కాల‌ను నెమ‌రు వేసుకుంటున్నారు. ఒక‌రిపై మ‌రొక‌రు మ‌మ‌కారాన్ని పెంచుకుంటూనే కోల్పోయినవ‌న్నీ తిరిగి తెచ్చుకునేందుకు తంటాలు ప‌డుతున్నారు. ఇది ఒకందుకు మంచిదే. ఎందుకంటే ఏ స‌మాజానికైతే విద్య‌, వైద్యం, సంస్కృతి పునాదిరాళ్లుగా ఉన్నాయో అవి నానాటికీ తీసిక‌ట్టుగా త‌యార‌య్యాయి. అంతేకాదు షో కేసులో మమ్మీలుగా మారాయి. త‌మ‌ను తాము ఉద్ద‌రించుకోలేని వాళ్లు ఉన్న‌త స్థాయి ప‌ద‌వుల్లో ఉండ‌డం కూడా నిబ‌ద్ధ‌త‌తో ప‌నిచేసే వాళ్ల‌కు ఇబ్బందిగా మారింది. ప్ర‌పంచంలోనే జ‌నాభా ప‌రంగా చూస్తే రెండో అతి పెద్ద దేశం మ‌న‌ది. వ‌స్తువుల ఉత్ప‌త్తి, వినిమ‌యం, వినియోగం చూస్తే ఎక్కువ‌గా మార్కెట్ అవ‌స‌రాల‌ను గుర్తించ‌డం, వాటితో ఉపాధి పొంద‌డం అన్న‌ది గ‌గ‌నంగా త‌యారైంది. దీనికంత‌టికీ గ‌త కొన్నేళ్లుగా ఈ దేశాన్ని పాలించిన పాల‌కుల‌దేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఇదే స‌మ‌యంలో స‌మున్న‌త భార‌తావ‌ని ప్ర‌పంచాన్ని శాసిస్తున్న నూత‌న సాంకేతిక‌త‌ను అందిపుచ్చు కోవ‌డంలో కొంత మేర‌కు స‌క్సెస్ అయ్యారు. అందుకే ఇండియ‌న్స్ కు ఎక్క‌డ‌లేనంత‌టి డిమాండ్. వీరికి యాక్సెస‌బిలిటీ ఎక్కువ‌. అంతేకాదు గ్రాస్పింగ్ ప‌వ‌ర్ కూడా మోతాదు కంటే మించి ఉండ‌డం కూడా అదన‌పు ప్ర‌యోజ‌నమే. అయితే ఈ ప్ర‌పంచాన్ని ముఖ్యంగా మ‌న‌ల్ని ఎన్నో డిసీజెస్ భ‌య‌పెట్టాయి. వెంటాడాయి. కానీ అన్నింటిని త‌ట్టుకుని నిల‌బ‌డ‌గ‌లిగాం. ఇదే స‌మ‌యంలో కొంద‌రు ప్రాణాలు కూడా కోల్పోయారు. టెక్నాల‌జీ శ‌ర‌వేగంగా ప‌రుగులు తీస్తున్నా ఇంకా మ‌నం ప్రారంభంలోనే ఉన్నాం. పోటీ తీవ్ర‌త‌ను త‌ట్టుకునే శ‌క్తి సామ‌ర్థ్యాల‌ను పెంపొందించుకోక పోవ‌డం వ‌ల్లనే ఇవాళ ప్ర‌తి దానికి మ‌నం ఇత‌ర దేశాల మీద ఆధార‌ప‌డాల్సి వ‌స్తున్న‌ది. దీంతో ఆయా దేశాలు మ‌న దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు భంగం క‌లిగించేలా ప్ర‌వ‌ర్తిస్తున్నాయి. సంక్షుభిత స‌మ‌యంలో, క‌ష్ట కాలంలో తీవ్ర ఆంక్ష‌లు విధిస్తున్నాయి. స్వాతంత్ర్యం సిద్ధించి 77 ఏళ్ల‌వుతున్నా ఇంకా స్వ‌యం స‌మృద్ధిని సాధించ‌లేక పోయాం. వ్య‌వ‌స్థ‌కు ఆయువు ప‌ట్టుగా ఉన్న‌టువంటి బ్యూరోక్ర‌సీ క‌ట్టుత‌ప్పి ప్ర‌వ‌ర్తిస్తున్న‌ది. న్యాయ వ్య‌వ‌స్థ అధ‌ర్మాన్ని ఆస‌రాగా చేసుకుని సాగుతున్న‌ది. పాల‌క వ్య‌వ‌స్థ పూర్తిగా నిర్వీర్య‌మై ..న‌డివీధిలో న‌గ్నంగా ఊరేగుతున్న‌ది. ఈ స‌మ‌యంలో న్యాయం, ధ‌ర్మం అన్న‌వి చెప్పు కోవ‌డానికి మాత్ర‌మే ప‌నికి వ‌స్తున్నాయి త‌ప్పా కోట్లాది సామాన్యుల‌కు భద్ర‌త‌నే కాదు భ‌రోసాను క‌ల్పించ‌లేక పోతున్నాయి.
లెక్క‌లేన‌న్ని సాంఘిక నేరాలు, ఘోరాలు, అఘాయిత్యాలు, హ‌త్య‌లు, మాన‌భంగాలు, చిత్ర‌హింస‌లు, మోసాలు, ఆర్థిక నేరాలు పెచ్చ‌రిల్లుతున్నాయి. 2009లో చోటు చేసుకున్న ఆర్థిక సంక్షోభం ప్ర‌పంచాన్ని అత‌లాకుత‌లం చేస్తే ఒక్క భార‌త‌దేశం, చైనాలు మాత్రం నిమ్మ‌లంగా నిల‌బ‌డ్డాయి. ఈ క్రెడిట్ అంతా కేవ‌లం సామాన్యులు, పేద‌లు, రైతుల‌దే. ఎందుకంటే వారు క‌ష్ట‌ప‌డి పోగు చేసుకున్న డ‌బ్బులే దేశాన్ని ర‌క్షించాయి. అంబానీలు, అదానీలు, టాటాలు, బిర్లాల నుంచి మాత్రం కాదన్న‌ది గుర్తించాలి. ఈ దేశంలో జ‌న్మించి సంపాద‌న కోసం విదేశాల‌కు వెళ్లిన ప్ర‌వాస భార‌తీయుల వ‌ల్ల ఒక్క శాతానికి మించి మేలు చేకూర‌లేదంటే విచిత్ర‌మ‌నిపిస్తుంది. అందుకే ప్ర‌తి ఒక్కరు వాస్త‌వాల‌ను గుర్తెర‌గాలి. ప‌ట్టు కోల్పోతున్న భార‌తీయ వ్య‌వ‌సాయ రంగాన్ని ప్రోత్స‌హించాలి. రైతుల‌ను ఆదుకోవాలి. ప్రాధాన్య‌త రంగాల‌కు ఊత‌మివ్వాలి. మొత్తం మీద క‌రోనా వైర‌స్ వ‌ల్ల ప్రాణ న‌ష్టం జ‌రిగి ఉండ‌వ‌చ్చు..కాద‌న‌లేం..బాధ ప‌డ‌కుండా ఉండ‌లేం..కానీ ఈ వ్యాధి వ‌ల్ల జ‌నానికి తామేం కోల్పోయామో తెలిసేలా చేసింది. అందుకు క‌రోనాకు హ్యాట్సాఫ్ చెప్ప‌క త‌ప్ప‌దు.

No comment allowed please