Supreme Court : సామాజిక న్యాయానికి అవినీతి అడ్డంకి

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన సుప్రీంకోర్టు

Supreme Court Corruption : భార‌త దేశ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ప్ర‌ధానంగా భార‌త రాజ్యాంగం సంక‌ల్పించిన ఆదేశ సూత్రాల‌కు , సామాజిక న్యాయానికి అవినీతి అనేది ప్ర‌ధాన అడ్డంకిగా మారింద‌ని పేర్కొంది. సంప‌ద‌పై దురాశ కార‌ణ‌మ‌ని అభిప్రాయ‌ప‌డింది.

రాజ్యాంగం ముంద‌స్తు వాగ్దానాన్ని సాధించ‌డంలో క‌ర‌ప్ష‌న్ ఇబ్బందిగా మారిందంటూ పేర్కొంది. అవినీతి(Supreme Court Corruption)  క్యాన్స‌ర్ కంటే భ‌యంక‌రంగా త‌యారైంద‌ని ధ‌ర్మాస‌నం ఆవేద‌న వ్య‌క్తం చేసింది. అవినీతిని ఏ మాత్రం స‌హించ‌కుండా దేశ ప్ర‌జ‌ల‌కు రాజ్యాంగ న్యాయ‌స్థానాలు రుణ‌ప‌డి ఉంటాయ‌ని నేరానికి పాల్ప‌డిన వారిప‌ట్ల క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని స్ప‌ష్టం చేసింది.

సంప‌ద ప్ర‌తి ఒక్క‌రికీ స‌మానంగా అందాల్సిన అవ‌స‌రం ఉంది. ఇందు కోస‌మే రాజ్యాంగం ఏర్ప‌డింది. దీనిని సాధించేలా చేయ‌డం న్యాయ స్థానం ప‌ని అని పేర్కొంది. ప్ర‌జ‌ల‌కు సామాజిక న్యాయం చేకూర్చేందుకు రాజ్యాంగంలోని ప్రాథ‌మిక వాగ్ధానాన్ని సాధించ‌డంలో అవినీతి ఒక అవ‌రోధంగా ఉంద‌ని తెలిపింది.

ఆదాయానికి మించిన ఆస్తులు కూడ‌బెట్టార‌నే ఆరోప‌ణ‌ల‌పై రాష్ట్ర మాజీ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ అమ‌న్ సింగ్ , ఆయ‌న భార్య‌పై న‌మోదైన ఎఫ్ఐఆర్ ను ర‌ద్దు చేస్తూ ఛ‌త్తీస్ గ‌ఢ్ హైకోర్టు ఇచ్చిన ఉత్త‌ర్వుల‌ను కొట్టి వేసింది.

జ‌స్టిస్ ఎస్ . ర‌వీంద్ర భ‌ట్ , దీపాంక‌ర్ ద‌త్ ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం(Supreme Court) ఈ కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. అవినీతి అనేది ఒక అనారోగ్యం. దాని ఉనికి జీవితంలోని ప్ర‌తి న‌డ‌క‌లో ఉంది. ఇది ఇప్పుడు పాల‌నకు సంబంధించిన కార్య‌క‌లాపాల రంగాల‌కే ప‌రిమితం కాలేదని పేర్కొంది. దీనిని ఎదుర్కోవాలంటే ప్ర‌జ‌లు మేలుకోవాల‌ని సూచించింది ధ‌ర్మాసనం.

Also Read : స‌రిహ‌ద్దు స‌మ‌స్య‌ల‌కు త్వ‌ర‌లో చెక్

Leave A Reply

Your Email Id will not be published!