Vikas Raj : 6న మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్
Vikas Raj : మునుగోడు ఉప ఎన్నిక ముగిసింది. ఊహించని రీతిలో పెద్ద ఎత్తున పోలింగ్ శాతం పెరిగింది. గతంలో 91 శాతంగా ఉండగా ప్రస్తుతం జరిగిన బై పోల్ లో 92 శాతం పోలింగ్ నమోదు కావడం విస్తు పోయేలా చేసింది. ఉప ఎన్నిక కౌంటింగ్ నవంబర్ 6న జరుగుతుందని వెల్లడించారు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ (సిఇఓ) వికాస్ రాజ్.
నియోజకవర్గంలో 2 లక్షల 41 వేల 805 ఓటర్లకు గాను 2 లక్షల 3 వేల దాకా ఓట్లు పోలైనట్లు సమాచారం. 119 కేంద్రాలలో 298 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మూడు చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. మొత్తంగా ఉప ఎన్నిక ప్రశాంతంగా జరిగిందని వెల్లడించారు వికాస్ రాజ్(Vikas Raj) .
అక్కడక్కడా చెదురు మదురు సంఘటనలు చోటు చేసుకున్నాయని తెలిపారు. అన్ని పోలింగ్ బూత్ ల నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించినట్లు పేర్కొన్నారు సీఇసి. మొత్తం ఉప ఎన్నికకు సంబంధించి 98 ఫిర్యాదులు అందాయని చెప్పారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చాక 6,100 లీటర్ల మద్యం సీజ్ చేశామన్నారు.
191 ఎఫ్ఐఆర్ కేసులు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఉప ఎన్నిక పూర్తయ్యేంత లోపు రూ. 8. 26 కోట్ల నగదు పట్టుబడిందని, దీనికి లెక్కలు చూపలేదని వెల్లడించడం విశేషం. పోలింగ్ ముగిసిన వెంటనే ఈవీఎంలను అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య నల్లగొండలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ లకు తరలించామన్నారు వికాస్ రాజ్(Vikas Raj) .
ఆదివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుందని స్పష్టం చేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.
Also Read : గులాబీ’కి జై కొట్టిన ఎగ్జిట్ పోల్స్