Senthil Balaji : సెంథిల్ బాలాజీకి కోర్టులో చుక్కెదురు
జూన్ 28 వరకు జ్యుడీషియల్ కస్టడీ
Senthil Balaji : జాబ్స్ స్కామ్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయిన తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీకి కోలుకోలేని షాక్ తగిలింది. 18 గంటలకు పైగా సోదాలు చేపట్టింది. చివరకు పక్కా ఆధారాలతో కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ అరెస్ట్ చేసింది. ఈ సమయంలో సెంథిల్ బాలాజీ ఉన్నట్టుండి కుప్ప కూలాడు. ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో ఆస్పత్రికి హుటా హుటిన తరలించారు. దీనిపై తీవ్ర స్థాయిలో ఖండించారు సీఎం ఎంకే స్టాలిన్. మంత్రులను ఎవరినీ అనుమతించ లేదు పరామర్శించేందుకు ఈడీ.
ఇదిలా ఉండగా మనీ లాండరింగ్ కేసులో కోర్టులో చుక్కెదురైంది మంత్రి సెంథిల్ బాలాజీకి(Senthil Balaji). ఆయనకు జూన్ 28 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. తనకు విధించిన 15 రోజుల రిమాండ్ ను తిరస్కరించాలని కోరుతూ సెంథిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇందుకు సంబంధించి విచారించిన ప్రిన్సిపల్ సెషన్ కోర్టు గురువారం కొట్టి వేసింది. దీంతో మంత్రికి దిమ్మ తిరిగింది. ఇంకా ఈ కేసుకు సంబంధించి న్యాయమూర్తి వాదనలు వినాల్సి ఉందని సమాచారం.
ఇదిలా ఉండగా మంత్రి సెంథిల్ బాలాజీకి ఒమండూరర్ ప్రభుత్వ ఆస్పత్రిలో యాంజియోగ్రామ్ చేపట్టారని ఇందుకు సంబంధించి ప్రూఫ్స్ ను కోర్టుకు సమర్పించారు. దీనిపై తీవ్రంగా తప్పు పట్టారు బీజేపీ చీఫ్ కే.అన్నామలై. ఇదంతా నాటకమని, తప్పించుకునేందుకు ఓ మార్గమని పేర్కొన్నారు.
Also Read : Ormax Popular Stars : మోస్ట్ పాపులర్ హీరోగా ప్రభాస్