Covid19 : భారీగా పెరిగిన కరోనా కేసులు
దేశమంతటా అప్రమత్తం
Covid19 Updates : కరోనా మహమ్మారి మరోసారి కాటు వేసేందుకు రెడీగా ఉంది. ఇప్పటికే తగ్గుముఖం పడుతూ వచ్చినప్పటికీ తాజాగా కరోనా కేసులు పెరగడం ఒకింత ఆందోలనకు గురి చేస్తోంది. బుధవారం ఒక్క రోజే 4 వేలకు పైగా కేసులు(Covid19 Updates) నమోదు కాగా గురువారం ఏకంగా 5 వేలకు పైగా కొత్తగా కేసులు నమోదు కావడం గమనార్హం. దేశ వ్యాప్తంగా ఈ కేసులతో కలుపుకుంటే యాక్టివ్ కేసులు 25 వేలు దాటాయి.
అనుకోకుండా కరోనా కేసుల తీవ్రత పెరగడంతో కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ అప్రమత్తం అయ్యింది. దేశంలోని పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అలర్ట్ చేసింది. అవసరమైన చర్యలు చేపట్టాలని, వైద్యులు , సిబ్బంది అందుబాటులో ఉండాలని, ఎంత ఖర్చు అయినా సరే కరోనా బాధితులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించింది.
కొత్త కేసులు ఏవైనా ఉంటే వెంటనే సమాచారం ఇవ్వాలని, ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని సూచించింది. అవసరమైన మందులు, సూదులు, సామాగ్రిని అందుబాటులో పెట్టాలని తెలిపింది కేంద్రం. 24 గంటల్లో కరోనా(Covid19 Updates) కారణంగా 15 మంది ప్రాణాలు కోల్పోయారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయని ప్రతి ఒక్కరు కోవిడ్ 19 రూల్స్ పాటించాలని స్పష్టం చేసింది. తగు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని పేర్కొంది. ఇక రోజూ వారీ పజిటివ్ రేట్ 3.32 శాతానికి పెరగడం కూడా ఆందోళన కలిగిస్తోందని తెలిపింది.
Also Read : జార్ఖండ్ విద్యా శాఖ మంత్రి ఇక లేరు