Covid19 : కరోనాపై ఏపీ సర్కార్ అలర్ట్
కొత్తగా నాలుగు పాజిటివ్ కేసులు
Covid19 : అమరావతి – దేశ వ్యాప్తంగా మరోసారి కరోనా కలకలం రేపుతోంది. దీంతో కేంద్రంలో కొలువు తీరిన మోదీ సర్కార్ యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టేందుకు రంగంలోకి దిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సమీక్షించారు. ఈమేరకు దేశంలోని అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది.
Covid19 – AP Govt Alert
ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని, టెస్టులకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. వెంటిలేటర్లు, అవసరమైన మందులను ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది కేంద్రం.
ఇదిలా ఉండగా ఇరు తెలుగు రాష్ట్రాలలో సైతం అప్రమత్తం అయ్యాయి. ఈ మేరకు తాజాగా ఏపీలో కరోనా(Covid) కలకలం రేపింది. కొత్తగా 4 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.
ఏలూరులో ఒకరు, వైజాగ్ లో 3 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వెల్లడైంది. ఇదిలా ఉండగా రాష్ట్రంలోని ఆలయాలలో టెస్టింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు.
Also Read : TTD : శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.40 కోట్లు