Covid19 : మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
తాజాగా దేశంలో 20,409 కేసులు
Covid19 : కరోనా మెల మెల్లగా తగ్గుముఖం పట్టినా రోజు రోజుకు మరికొన్ని కేసులు దేశంలో నమోదవుతున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ముందు జాగ్రత్తగా 18 నుంచి ఆ పైబడిన ప్రతి ఒక్కరికీ బూస్టర్ డోస్ ఇవ్వాలని నిర్ణయించింది.
ఈ మేరకు పెద్ద ఎత్తున వ్యాక్సిన్లను అందుబాటులో ఉంచింది దేశ వ్యాప్తంగా. ఇప్పటికే ప్రచారం కూడా చేపట్టింది. రెండు డోసులు వేసుకున్న వారంతా మూడో డోసు తప్పనిసరిగా వేసుకోవాలని స్పష్టం చేసింది.
ఈ మేరకు దేశంలోని ఆయా రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. ఈ మేరకు ఏర్పాట్లు కూడా చేశాయి. కొందరు మాత్రం వేసుకోకుండానే బయట తిరుగుతున్నారంటూ కేంద్ర కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖ గుర్తించింది.
ఎవరెవరు వ్యాక్సిన్లు వేసుకున్నారు లేదోనని సర్వే చేపట్టాలని కేంద్ర సర్కార్ ఆదేశించింది. ఇదిలా ఉండగా శుక్రవారం వరకు అందిన సమాచారం మేరకు భారత దేశంలో 20,409 కరోనా కొత్త కేసులు(Covid19) నమోదయ్యాయి.
ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. యాక్టివ్ కేసులు మోత్తం 1.43 లక్షలుగా ఉన్నాయని వెల్లడించింది. ముందు రోజు కంటే స్వల్పంగా తగ్గాయి. కానీ ఒక్కోసారి పెరగడం మరోసారి తగ్గడం జరుగుతూ వస్తోంది.
ఇక దేశంలో ఇప్పటి వరకు మొత్తం కేసులం సంఖ్య 43,979,730కి చేరింది. ఒక్క రోజులో 20,557 కేసులు నమోదు కావడం గమనార్హం. గత 24 గంటల్లో కరోనా(Covid19) కారణంగా 47 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది ఆరోగ్య శాఖ.
ఇప్పటి వరకు భారత దేశంలో చని పోయిన వారి సంఖ్య కరోనా కారణంగా 5,26,258 మంది ఉన్నారు.
Also Read : రాజస్థాన్ లో కూలిన మిగ్ -21 జెట్