Covid19 : దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
24 గంటల్లో కరోనాతో 35 మంది మృతి
Covid19 : దేశంలో రోజు రోజుకు కరోనా తగ్గుముఖం పట్టినా మళ్లీ కొత్తగా కేసులు పుట్టుకు వస్తున్నాయి. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 5,664 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.
కరోనా వైరస్(Covid19) కారణంగా 35 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం ఇన్ఫెక్షన్లలో యాక్టివ్ కేసులు 0.11 శాతంగా ఉన్నాయి. కేవలం ఒకే ఒక్క రోజులో పెద్ద ఎత్తున కేసులు నమోదు కావడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.
ఇప్పటి వరకు కోవిడ్ కేసులు నమోదైన సంఖ్య భారీగా పెరిగింది. 4,45,34,188కి చేరుకున్నాయి కరోనా కేసులు. ఇక వీటిలో క్రియాశీల కేసులు 47,922కి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది.
తాజాగా మరణించిన 35 కేసులతో కలుపుకుంటే ఇప్పటి వరకు దేశంలో 5,28,237 మంది చనిపోయినట్లు తెలిపింది. కేరళ రాష్ట్రంలోనే 21 మంది ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.
ఇక ఇన్ఫెక్షన్లలో యాక్టివ్ కేసుల శాతం 0.11గా ఉండగా కోవిడ్ -19 రికవరీ రేటు 98.71 శాతానికి పెరిగిందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
అయితే రోజూ వారీ సానుకూలత రేటు 1.96 శాతంగా ఉంది. వారాంతపు అనుకూలత రేటు 1.79 శాతంగా నమోదైంది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,39,57,929కి చేరుకుంది.
మరణాల సంఖ్య శాతం 1.19గా నమోదైంది. ఇక కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రకారం వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటి వరకు దేశంలో 216.56 కోట్ల టీకాలు ఇచ్చారు.
కేంద్ర ప్రభుత్వం కరోనా కేసులు పెరుగుతుండడంతో అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఈ మేరకు బూస్టర్ డోస్ వేసుకోవాలని సూచించింది.
Also Read : లండన్ కు చేరుకున్న రాష్ట్రపతి