Arvind Kejriwal : కేజ్రీవాల్ పోరాటానికి సీపీఐ మ‌ద్ద‌తు

ధ‌న్య‌వాదాలు తెలిపిన ఢిల్లీ సీఎం

Arvind Kejriwal : కేంద్ర ప్ర‌భుత్వం రాజ్యాంగ విరుద్ద‌మైన ఆర్డినెన్స్ కు విరుద్దంగా ఒంట‌రి పోరాటం చేస్తున్న ఆప్ క‌న్వీన‌ర్, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ కు సంఘీభావం తెలిపింది సీపీఐ పార్టీ. ఈ మేర‌కు ఆపార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి డి. రాజా, కార్య‌ద‌ర్శి కొన‌క‌ళ్ల నారాయ‌ణ ను క‌లుసుకున్నారు సీఎం కేజ్రీవాల్(Arvind Kejriwal). వారికి సాద‌ర స్వాగ‌తం ప‌లికారు. కేంద్ర స‌ర్కార్ అనుస‌రిస్తున్న విధానాలు పూర్తిగా ప్ర‌జా వ్య‌తిరేక‌మైన‌వ‌ని పేర్కొన్నారు. మోదీ ప్ర‌భుత్వం నియంతృత్వ ధోర‌ణితో ముందుకు వెళుతోంద‌న్నారు.

ఢిల్లీ ప్ర‌జ‌లు ప్ర‌జాస్వామ్య బ‌ద్దంగా ఆప్ స‌ర్కార్ ను ఎన్నుకున్నార‌ని పేర్కొన్నారు డి. రాజా. కేవ‌లం క‌క్ష సాధింపు త‌ప్ప మ‌రొక‌టి కాద‌న్నారు. దేశంలోని అత్యున్న‌త న్యాయ స్థానం సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టినా, చివ‌ర‌కు ఎల్జీకీ ప‌వ‌ర్స్ లేవంటూ స్ప‌ష్టమైన తీర్పు ఇచ్చినా దానిని కూడా ప‌ట్టించుకోక పోవ‌డం దారుణ‌మ‌న్నారు. ఇదిలా ఉండ‌గా ఢిల్లీ ప్ర‌జ‌లంద‌రి త‌ర‌పున సీపీఐ నాయ‌కుల‌కు ధ‌న్య‌వాదాలు తెలియ చేసుకుంటున్నాన‌ని పేర్కొన్నారు.

కేంద్రం ఢిల్లీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఆర్డినెన్స్ తీసుకు వ‌చ్చింది. పూర్తి అధికారాలు త‌మ‌కే చెందుతాయ‌ని స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు పార్ల‌మెంట్ లో ప్ర‌వేశ పెట్ట‌నుంది కేంద్రం. కాగా చ‌ట్టంగా రావాలంటే లోక్ స‌భ‌తో పాటు రాజ్య‌స‌భ‌లో తీర్మానం పొందాల్సి ఉంటుంది. ప్ర‌స్తుతం లోక్ స‌భ‌లో బీజేపీకి ఫుల్ మెజారిటీ ఉన్నా రాజ్య‌స‌భ‌లో లేదు. అందుకే ఆప్ ట్రై చేస్తోంది.

Also Read : KTR Telangana : ప్ర‌జారోగ్యంలో తెలంగాణ టాప్

 

Leave A Reply

Your Email Id will not be published!