CPI Leader Narayana: ఇది హిందువుల సమస్య.. సుప్రీం విచారణ చేయాలి!

ఇది హిందువుల సమస్య.. సుప్రీం విచారణ చేయాలి!

CPI Leader Narayana: వివాదం రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారాన్ని రేపుతోంది. తిరుమల కల్తీ లడ్డూపై ప్రతిఒక్కరు తీవ్రంగా ఖండిస్తున్నారు. తాజాగా టీటీడీ కల్తీ లడ్డూ వివాదంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ(CPI Leader Narayana) స్పందించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… టీటీడీ లడ్డు ప్రసాదం కల్తీ అనేది అంతర్జాతీయంగా చర్చ జరుగుతోందన్నారు. ధర్మారెడ్డి అనే వాడు చాలా దుర్మార్గుడని వ్యాఖ్యలు చేశారు. ధర్మారెడ్డి ఐడీఎస్ అధికారి అయినప్పటికీ వైసీపీకి అనుకూలంగా పని చేశారని ఆరోపించారు. ఆయన టీటీడీ ఈవో అయినా కూడా.. వైసీపీ నేతగా వ్యవహరించారన్నారు.

CPI Leader Narayana Comment

తిరుమల లడ్డూ వ్యవహారం లక్షల భక్తుల సమస్య అని చెప్పుకొచ్చారు. లడ్డూ కల్తీపై సుప్రీంకోర్టు విచారణ చేయాలని.. కల్తీ నిజమా కాదో తేల్చాలన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా గత ప్రభుత్వం వ్యవహరించిందని విమర్శించారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో వీలైనంత త్వరగా విచారణ జరపాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లక్షల మంది రోజు టీటీడీకి వచ్చి లడ్డూ కొనుగోలు చేస్తారని అన్నారు. లడ్డూ తయారీకి వాడే నెయ్యి పబ్లిక్ సెక్టర్‌లో ఉన్న డైరీకి ఇవ్వాలని.. ఊరు, పేర్లు లేని కంపెనీలకు ఇవ్వొద్దని సీపీఐ నేత నారాయణ పేర్కొన్నారు.

టీటీడీ లడ్డు ప్రసాదం కల్తీ అనేది అంతర్జాతీయంగా చర్చ జరుగుతోందని సీపీఐ నేత నారాయణ అన్నారు. ధర్మారెడ్డి అనే వాడు చాలా దుర్మార్గుడని వ్యాఖ్యలు చేశారు. ధర్మారెడ్డి ఐడీఎస్ అధికారి అయినప్పటికీ వైసీపీకి అనుకూలంగా పని చేశారని ఆరోపించారు.

Also Read : Jani Master Case : జానీ మాస్టర్ కు 14 రోజుల రిమాండ్ విధించిన ఉప్పర్ పల్లి కోర్టు

Leave A Reply

Your Email Id will not be published!