CPI Narayana : ఆంధ్రప్రదేశ్ – సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ నిప్పులు చెరిగారు. ఆయన ఈ మధ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. శుక్రవారం నారాయణ(CPI Narayana) మీడియాతో మాట్లాడారు. తిరుమలలో అభివృద్ది పనుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిధులను వాడితే తప్పు ఏమిటని ప్రశ్నించారు.
CPI Narayana Slams BJP
టీటీడీ నిధుల ఖర్చు విషయంలో భారతీయ జనతా పార్టీ, దాని అనుబంధ సంస్థలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయంటూ మండిపడ్డారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ఈ నిధులు తమవే అయినట్లు మాట్లాడటం మంచి పద్దతి కాదన్నారు.
దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున తిరుమల పుణ్య క్షేత్రానికి వస్తుంటారని తెలిపారు. నిత్యం వేలాది మంది దర్శించుకునే భక్తుల కోసం టీటీడీ వసతి సౌకర్యాలు, అభివృద్ది పనుల కోసం ఖర్చు చేస్తోందని దీని వల్ల వచ్చే నష్టం ఏమిటని ప్రశ్నించారు.
ఏ ఆలయమైనా , పాలక మండలి అయినా ముందుగా భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలని అనుకుంటారని , ఇదే టీటీడీ చేస్తోందని స్పష్టం చేశారు. దీనిని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు సీపీఐ నారాయణ.
Also Read : Nara Brahmani : బాబు ఆరోగ్యంపై బ్రాహ్మణి ఆందోళన