CPI Narayana : కాంగ్రెస్ ద్రోహం నారాయ‌ణ ఆగ్ర‌హం

పొత్తు ధ‌ర్మాన్ని పాటించ‌క పోతే ఎలా

CPI Narayana : ఆంధ్ర‌ప్ర‌దేశ్ – సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తెలంగాణ ఎన్నిక‌ల్లో సీపీఐతో పెట్టుకుంటామ‌ని ముందే ప్ర‌క‌టించి ఆ త‌ర్వాత చేతులెత్తేయ‌డం దారుణ‌మ‌ని పేర్కొన్నారు.

CPI Narayana Serious on Congress

నారాయ‌ణ(CPI Narayana) ట్విట్ట‌ర్ వేదిక‌గా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పొత్తు ధ‌ర్మం అనేది ఒక‌టి ఉంటుంద‌ని , దానిని పాటించ‌క పోవ‌డం రాజ ధ‌ర్మం కాద‌ని ఆ విష‌యం కాంగ్రెస్ పార్టీ తెలుసుకుంటే మంచిద‌ని స్ప‌ష్టం చేశారు. ఇదిలా ఉండ‌గా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో పాటు సీపీఐ, సీపీఎం, మ‌రో 28 పార్టీలు ఐక్య కూట‌మిగా ఏర్ప‌డ్డాయి.

ప్ర‌స్తుతం దేశంలోని 5 రాష్ట్రాల‌లో శాస‌న‌స‌భ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. వాటిలో తెలంగాణ‌, మ‌ధ్య ప్ర‌దేశ్, ఛ‌త్తీస్ గ‌ఢ్ , రాజ‌స్థాన్ , మ‌ణిపూర్ ఉన్నాయి. తెలంగాణ‌లో క‌నీసం త‌మ‌కు 10 సీట్లు ఇవ్వాల‌ని వామ‌ప‌క్ష పార్టీలు సీపీఐ, సీపీఎం కోరాయి. ఇందుకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ‌లు జ‌రిగాయి.

వీటిలో తాము కోరిన సీట్లే కావాల‌ని ప‌ట్టుప‌ట్టాయి. చివ‌ర‌కు చ‌ర్చ‌లు విఫ‌ల‌మయ్యాయి. దీంతో కాంగ్రెస్ కు క‌టీఫ్ చెప్పాయి. దీనిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు కొన‌క‌ళ్ల నారాయ‌ణ‌. రాబోయే రోజుల్లో ఆ పార్టీకి పుట్ట‌గ‌తులు ఉండ‌వంటూ శాప‌నార్థాలు పెట్టారు.

Also Read : CM KCR : కాంగ్రెస్ నిర్వాకం కేసీఆర్ ఆగ్ర‌హం

Leave A Reply

Your Email Id will not be published!