CPI Ramakrishna : అంగన్ వాడీల వేతనాలు పెంచాలి
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ
CPI Ramakrishna : అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలన పడకేసిందని సంచలన ఆరోపణలు చేశారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ. సీఎంకు బహిరంగ లేఖ రాశారు. అంగన్ వాడీల న్యాయమైన సమస్యలను పరిష్కరించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
CPI Ramakrishna Comment about Anganwadi Salaries
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్ర సర్కార్ కంటే రూ. 10 వేలు పెంచి ఇస్తామని మాట ఇచ్చామని కానీ దాని గురించి ఇప్పటి వరకు అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తాజాగా తెలంగాణలో కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ సర్కార్ వెంటనే అంగన్ వాడీల వేతనం రూ. 18 వేలు పెంచుతూ జీవో జారీ చేసిందని గుర్తు చేశారు. అయితే జగన్ రెడ్డి గత నాలుగున్నర ఏళ్లలో అంగన్ వాడీలను విస్మరించడం దారుణమని పేర్కొన్నారు రామకృష్ణ(CPI Ramakrishna). సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా తుంగలో తొక్కారని ప్రశ్నించారు.
ఏపీ ప్రభుత్వం అంగన్ వాడీలను చర్యలు చేపట్టాలని అనుకోవడం దుర్మార్గమని ఎద్దేవా చేశారు. తక్షణమే చర్చల ద్వారా అంగన్ వాడీల సమ్మె విరమణకు చొరవ చూపాల్సిందిగా కోరుతున్నానని తెలిపారు.
Also Read : Congress Slams : కేటీఆర్ కామెంట్స్ కాంగ్రెస్ సీరియస్
