CPI Ramakrishna : జగన్ పాలనలో ప్రాజెక్టులపై వివక్ష
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ
CPI Ramakrishna : రాష్ట్రంలో దయనీయమైన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి కొలువు తీరిన తర్వాత ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదని ఆరోపించారు. దీని వల్ల సాగు, తాగు నీటికి జనం, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు.
CPI Ramakrishna Comments
రాయలసీమలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసిన పాపాన పోలేదన్నారు. జగన్ పాలన నాలుగు ఏళ్లు పూర్తయిందని ఇప్పటి వరకు ఎన్ని ప్రాజెక్టులకు మోక్షం కలిగించాడో సీఎం ప్రజలకు చెప్పాలని కె. రామకృష్ణ(CPI Ramakrishna) డిమాండ్ చేశారు. వాటిని ఎందుకు ఇప్పటి దాకా పూర్తి చేయలేదో స్పష్టం చేయాలన్నారు. పొద్దస్తమానం సంక్షేమ పాలన అంటూ ప్రచారం చేసుకోవడం తప్ప ఒక్కటి కూడా ప్రజలకు మేలు చేకూర్చిన పని ఇంత వరకు చేపట్ట లేదన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి.
ప్రత్యేకించి పోలవరం ప్రాజెక్టుపై ఆయన ప్రశ్నించారు. ఇప్పటి వరకు పోలవరం నిర్వాసితులకు నష్ట పరిహారం చెల్లించ లేదని మండిపడ్డారు. గత 2020, 2021, 2022, 2023 సంవత్సరాలుగా ఇస్తామంటూ దాట వేస్తూ వస్తున్నారంటూ ధ్వజమెత్తారు కె. రామకృష్ణ. ఇకనైనా మాయ మాటలు, సొల్లు కబుర్లు చెప్పడం మాను కోవాలని హితవు పలికారు.
Also Read : Rahul Gandhi : బీజేపీ దోస్తులారా భయపడకండి