CR Kesavan : బీజేపీలో చేరిన రాజగోపాలాచారి మనవడు
కాషాయ తీర్థం పుచ్చుకున్న సీఆర్ కేశవన్
CR Kesavan : ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు , భారత దేశానికి చివరి గవర్నర్ జనరల్ అయిన చక్రవర్తుల రాజగోపాలాచారి ముని మనవడు సీఆర్ కేశవన్ శనివారం భారతీయ జనతా పార్టీలో చేరారు. మోదీ ప్రభుత్వం కరోనాను ఎదుర్కోవడంలో సక్సెస్ అయ్యిందని కితాబు ఇచ్చారు. ఆయన గత కొంత కాలం నుచీ కేంద్ర సర్కార్ ను ఏదో రకంగా ప్రశంసిస్తూ వస్తున్నారు. త్వరలోనే కాషాయ జెండా కప్పుకుంటారని ప్రచారం జరిగింది. కానీ ఎందుకనో ఆలస్యం అయ్యింది. అది ఇవాల్టితో తీరి పోయింది.
ఇదిలా ఉండగా బీజేపీలోకి జంప్ అయ్యే వారి సంఖ్య రాను రాను పెరుగుతోంది. ఇప్పటికే ఏపీ ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు కేరళ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ కె ఆంటోనీ సైతం భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకున్నారు.
తాజాగా సీఆర్ కేశవన్(CR Kesavan) కూడా చేరడం ఆ పార్టీకి మరింత బలాన్ని ఇచ్చినట్లయింది. దేశాన్ని స్థాపించిన తండ్రులు, తల్లులపై బీజేపీకి ఉన్న ప్రగాఢ గౌరవం అని పేర్కొన్నారు.
దేశాన్ని స్థాపించిన తండ్రులు మరియు తల్లులపై బిజెపికి ఉన్న “ప్రగాఢ గౌరవం” అని సిఆర్ కేశవన్ ప్రశంసించారు. గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. ఇదిలా ఉండగా ప్రజా కేంద్రీకృత విధానాలతో , అవినీతి రహిత, సమ్మిళిత పాలనతో భారత దేశంల్ టెక్టోనిక్ పరివర్తనకు నాంది పలికినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఆకాశానికి ఎత్తేశారు సీఆర్ కేశవన్. తమిళనాడుకు చెందిన ఆయన ఇటీవల జరిగిన కాశీ తమిళ సమాగం గురించి ప్రస్తావించారు.
Also Read : గ్యాంగ్‌స్టర్స్ ను వదిలి పెట్టను – సీఎం