Ashwini Choubey : నితీశ్ చేతకానితనం వల్లే నేరాలు
కేంద్ర మంత్రి అశ్విని చౌబే ఆగ్రహం
Ashwini Choubey : కేంద్ర మంత్రి అశ్విని చౌబే నిప్పులు చెరిగారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్ పై సంచలన ఆరోపణలు చేశారు. ఆయన నవుంసకత్వానికి గురైన వ్యక్తి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. రాష్ట్రంలో ఓవైపు నేరాలు, ఘోరాలు పెరిగి పోయాయని కానీ ఇప్పటి వరకు ఒక్క చర్య తీసుకున్న పాపాన పోలేదన్నారు.
అసలు ఈ రాష్ట్రంలో సీఎం అనే వ్యక్తి ఉన్నాడో లేడో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. పాలన పడకేసిందని , నితీశ్ కుమార్ కు వయస్సు మీద పడుతోందని, ఆయన ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలియడం లేదన్నారు కేంద్ర మంత్రి(Ashwini Choubey). నేరాలను నియంత్రించడంలో పూర్తిగా బీహార్ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
గత కొద్ది రోజులుగా బీహార్ లో వరుసగా ఘోరమైన నేరాలు చోటు చేసుకుంటున్నాయని గుర్తు చేశారు. నితీశ్ కుమార్ నపుంసకత్వ బాధితుడు అని కేంద్రి పేర్కొనడం కలకలం రేపింది. దీనిపై తీవ్రంగా తప్పు పట్టారు జేడీయూ నేతలు. బీహార్ లోని కైమూర్ లో మీడియాతో మాట్లాడారు.
ఇలా అనడం కూడా తప్పేనని కానీ గత రెండు రోజులుగా ప్రజలు అకారణంగా చని పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అశ్విని చౌబే. మహిళలు దారుణంగా చంపబడ్డారు. జంగిల్ రాజ్ కాక పోతే ఇంకేమిటి అని ప్రశ్నించారు కేంద్ర మంత్రి(Ashwini Choubey).
బీహార్ రాష్ట్రాన్ని నడిపించే స్థితిలో నితీశ్ కుమార్ లేరని అన్నారు. వెంటనే తన సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు అశ్విని చౌబే.
Also Read : సరిహద్దు వివాదం బస్సులకు మంగళం