Criminal Cases MP Sons : కేకే కొడుకులపై క్రిమినల్ కేసు
బీఆర్ఎస్ ఎంపీ కేశవ రావుకు షాక్
Criminal Cases MP Sons : సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా పేరు పొందిన రాజ్యసభ ఎంపీ కంచర్ల కేశవరావు (కేకే) కు బిగ్ షాక్ తగిలింది. ఆయన కొడుకులపై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు(Criminal Case) నమోదు చేశారు. దొంగ సంతకాలతో ప్రవాస భారతీయురాలైన మహిళకు చెందిన స్థలాన్ని కబ్జా చేశారని ఆరోపణలు ఉన్నాయి. బాధిత మహిళ నేరుగా స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో కథ బయటకు వచ్చింది. ఎంపీ కుమారులు విప్లవ్ కుమార్ , వెంకటేశ్వర్ రావు మీద పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం విశేషం.
ఇదిలా ఉండగా నెల రోజుల కిందటే కేసు నమోదైంది. కానీ ఇది బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు పోలీసులు. చివరకు బాధిత మహిళ తన ఆవేదనను చెప్పడంతో కేసు విషయం పొక్కింది. ప్రస్తుతం అధికార పార్టీలో కీలకమైన నాయకుడిగా ఉన్నారు కేకే.
ప్రస్తుతం పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా కేశవరావు ఉన్నారు. హైదరాబాద్ మేయర్ కు సోదరులపై కేసు నమోదు కావడం ఇప్పుడు ఇరుకున పెట్టేలా చేసింది. విచిత్రం ఏమిటంటే బంజారా హిల్స్ ప్రాంతంలో ఉన్న స్థలంపై ఇద్దరు కొడుకులు కన్నేశారు. ఆపై ఫోర్జరీ సంతకాలు చేసి కొట్టేసేందుకు యత్నించారు. తాజాగా ఈ వ్యవహారం బయట పడడంతో తీవ్ర దుమారం రేగింది.
Also Read : India Women Squad Asian Games : మహిళా క్రికెట్ టీం డిక్లేర్
