KTR : విమ‌ర్శ‌లు స‌రే వాస్త‌వాల మాటేంటి – కేటీఆర్

ఎందుకు పాజిటివ్ వార్త‌లు ఇవ్వ‌డం లేదు

KTR : తెలంగాణ రాష్ట్ర ఐటీ, పుర‌పాలిక శాఖ మంత్రి కేటీఆర్(KTR) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌భుత్వ ప‌రంగా త‌ప్పు జ‌రిగితే మీడియా విమ‌ర్శించ‌డంలో త‌ప్పు లేద‌న్నారు. కానీ ఇదే క్ర‌మంలో జ‌రిగిన మంచి ప‌నుల గురించి ఎందుకు ప్ర‌స్తావించ‌డం లేదంటూ ప్ర‌శ్నించారు.

ఏ రంగంలో నైనా రాణించాలంటే ప్ర‌తిభ అన్న‌ది ముఖ్య‌మ‌ని కానీ వార‌స‌త్వం కాద‌న్నారు. రాజ‌కీయాల్లో అధికారం శాశ్వతం కాద‌న్నారు. ఇందిరాగాంధీ , ఎన్టీఆర్ లాంటి వాళ్ల‌నే ఓడించార‌ని వాళ్ల ముందు తామెంత అన్నారు కేటీఆర్. మీడియాకు ప‌రీక్ష ఉన్న‌ట్టే త‌మ లాంటి వారికి కూడా ప్ర‌తి ఐదేళ్ల‌కు ఒక‌సారి ఉంటుంద‌న్నారు.

కానీ ప్ర‌చుర‌ణ‌, మీడియా, సోష‌ల్ మీడియా ప్ర‌తి రోజూ పోరాడాల్సిందేన‌ని పేర్కొన్నారు. గ‌తంలో ప్రింట్ ఉండేది. ఆ త‌ర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వ‌చ్చింద‌న్నారు. ఆ త‌ర్వాత ఇప్పుడు సోష‌ల్ మీడియాను కంట్రోల్ చేయ‌క పోవ‌డం ఎవ‌రి త‌రం కాద‌న్నారు. తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత ఎన్నో అభివృద్ది కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేశామ‌న్నారు.

గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా 24 గంట‌ల పాటు క‌రెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ఒక్క‌టేన‌ని దీని గురించి ఎందుకు రాయ‌డం లేద‌న్నారు కేటీఆర్. శ‌నివారం హైద‌రాబాద్ లోని అంబేద్క‌ర్ ఓపెన్ యూనివ‌ర్శిటీలో మీడియా ఇన్ తెలంగాణ స‌ద‌స్సుకు మంత్రి హాజ‌రై ప్ర‌సంగించారు.

ఏది న్యూసో ఏది వ్యూసో తెలియ‌డం లేదన్నారు. తెలంగాణ ఉద్య‌మంలో జ‌ర్న‌లిస్టులు పోషించిన పాత్ర గొప్ప‌ద‌న్నారు. పొలిటిక‌ల్ , బిజినెస్, వినోదం, స్పోర్ట్స్ , నేర‌స్తుల వార్త‌ల‌కు ఎక్కువ ప్ర‌యారిటీ ఉంటోంద‌ని స్ప‌ష్టం చేశారు కేటీఆర్(KTR).

Also Read : సామాజిక న్యాయం లేకపోతే ప్ర‌మాదం

Leave A Reply

Your Email Id will not be published!