Droupadi Murmu : ద్రౌపది ముర్ముకు జై కొట్టిన విపక్షాలు
ఆదివాసీ కార్డు బలంగా పని చేసింది
Draupadi Murmu : ప్రస్తుతం దేశంలో వ్యూహాలు పన్నడంలో, ఊహించని రీతిలో దెబ్బ కొట్టడంలో భారతీయ జనతా పార్టీ తర్వాతే ఎవరైనా. ఇప్పుడు బీజేపీ గురించి మాట్లాడాలంటే మోదీకి ముందు మోదీకి తర్వాత అన్నది చూడాలి.
అలా పార్టీని తన గుప్పట్లోకి తీసుకున్నారు మోదీ. పార్టీలో ముగ్గురు నేతలు మాత్రమే కీలకంగా వ్యవహరిస్తున్నారు. వారికి మోదీ త్రయంగా పేరొంది. నరేంద్ర మోదీ,
అమిత్ చంద్ర షా, జేపీ నడ్డా. ఒకరు ప్రధాని. మరొకరు ట్రబుల్ షూటర్ గా పేరొందిన కేంద్ర హోం శాఖ మంత్రి. ఇంకొకరు బీజేపీకి అన్నీ తానై వ్యవహరిస్తున్న చీఫ్ నడ్డా.
విచిత్రం ఏమిటంటే భారత రాష్ట్రపతి ఎన్నికల్లో అత్యధికంగా అధికారంలో బీజేపీ సంకీర్ణ సర్కార్ కంటే 8 వేలకు పైగా ఓట్లు విపక్షాలకు ఉన్నాయి. కానీ బీజేపీ అభ్యర్థి 64 శాతం ఓట్లతో గెలుపొందడం విస్తు పోయేలా చేసింది.
అధికారం, కేంద్ర దర్యాప్తు సంస్థల భయం, అవినీతి, అక్రమాల కారణంగా మోదీ చెప్పినట్లు విపక్షాలకు చెందిన ప్రజా ప్రతినిధులు ద్రౌపది ముర్ముకు ఓటు వేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఒక రకంగా విపక్షాలకు కోలుకోలేని షాక్ మొత్తం ఎంపీల ఓట్లలో 540 ఓట్లు ముర్ముకే పడడం విశేషం. సిన్హాకు 208 మంది మాత్రమే ఓటు వేయడం గమనార్హం. అస్సాం, జార్ఖండ్ , ఎంపీ రాష్ట్రాల నుంచి క్రాస్ ఓటింగ్ జరిగింది.
ప్రత్యేకంగా బీజేపీ వ్యూహాత్మకంగా ముందు నుంచి అడుగు వేసింది. ఒకటి ఆదివాసీ గిరిజన జాతికి చెందిన వ్యక్తిని ఎంపిక చేయడం.
అది మహిళకు అవకాశం ఇవ్వడం. ఇక్కడే ద్రౌపది ముర్ము(Draupadi Murmu) గెలిచేందుకు మార్గం ఏర్పడింది. 104 మందికి పైగా ప్రతిపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలు ఓటు వేసినట్లు ప్రాథమిక అంచనా.
Also Read : ద్రౌపది ముర్ము ఘన విజయం
While President-elect #DroupadiMurmu got a vote in all states, Opposition's Presidential candidate Yashwant Sinha drew a blank in Andhra Pradesh, Nagaland, & Sikkim. pic.twitter.com/QTVtiRqBYS
— ANI (@ANI) July 21, 2022