TTD Brahmotsavam : తిరుమ‌ల‌కు పోటెత్తిన భ‌క్త‌జ‌నం

ద‌ర్శ‌నానికి 10 గంట‌ల స‌మ‌యం

TTD Brahmotsavam :  కోట్లాది మంది భ‌క్తుల‌ను క‌లిగి ఉన్న తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి బ్ర‌హ్మోత్స‌వాలు(TTD Brahmotsavam) అంగ‌రంగ వైభ‌వంగా ప్రారంభ‌మ‌య్యాయి. ఉత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) విస్తృత ఏర్పాట్లు చేసింది. భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా చేసినా ఊహించ‌ని రీతిలో భ‌క్తులు తండోప తండాలుగా త‌ర‌లి వ‌చ్చారు.

క‌రోనా కార‌ణంగా గ‌త రెండు సంవ‌త్స‌రాల కాలం నుంచి బ్ర‌హ్మోత్స‌వాల‌ను నిర్వ‌హించ లేదు. తాజాగా ఈ ఏడాది 2022లో శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల‌ను ప్రారంభించింది. ఎప్ప‌టి లాగే ఈసారి ఏపీ ముఖ్య‌మంత్రి సందింటి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రాష్ట్ర ప్ర‌భుత్వం త‌రపున శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి, అలివేలు మంగ‌మ్మ వార్ల‌కు ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించారు.

కాగా ముందు జాగ్ర‌త్త‌గా టీటీడీ సిఫార్సు లేఖ‌ల‌ను ర‌ద్దు చేసింది. ఇదిలా ఉండ‌గా ఉత్స‌వాలలో స్వామి వారిని ద‌ర్శించుకునే సామాన్య భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం క‌ల్పించ‌డ‌మే త‌మ ముఖ్య ఉద్దేశ‌మ‌ని స్ప‌ష్టం చేసింది ఇప్ప‌టికే టీటీడీ(TTD Brahmotsavam). అయితే శ్రీ సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ అంత‌కంత‌కూ పెరుగుతోంది.

స్వామి వారిని ద‌ర్శించుకునేందుకు 25 కంపార్ట్ మెంట్ల‌లో భ‌క్తులు వేచి ఉన్నారు. వీరికి 10 గంట‌ల‌కు పైగా స‌మ‌యం ప‌డుతుంది. నిన్న రికార్డు స్థాయిలో ఏకంగా 83 వేల‌కు పైగా భ‌క్తులు స్వామి వారిని ద‌ర్శించుకున్నారు. 28 వేల మంది త‌ల‌నీలాలు స‌మ‌ర్పించుకున్నారు.

కాగా కానుక‌ల ద్వారా హుండీ ఆదాయం రూ. 3 కోట్ల‌కు పైగా వ‌చ్చింద‌ని టీటీడీ వెల్ల‌డించింది. బ్ర‌హ్మోత్స‌వాల‌లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు ఆక‌ట్టుకున్నాయి.

Also Read : యువ ర‌చ‌యిత‌ల కోసం ప‌థ‌కం

Leave A Reply

Your Email Id will not be published!