CV Anand : హైదరాబాద్ – మాదాపూర్ డ్రగ్స్ వ్యవహారం మరోసారి కలకలం రేపుతోంది. ఇప్పటికే టాలీవుడ్ డ్రగ్స్ కేసు సంచలనం సృష్టించింది. 2017లో ప్రముఖ నటుడు నవదీప్ హాజరయ్యాడు. ఆయనతో పాటు రానా, రవితేజ, దర్శకుడు పూరీ జగన్నాథ్, రకుల్ ప్రీత్ సింగ్ కేంద్ర దర్యాప్తు సంస్థల ముందుకు వచ్చారు. కానీ ఆ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేక పోయారు పోలీసులు.
CV Anand Comments Viral
ఏది ఏమైనా తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ వ్యవహారంలో పూర్తిగా పట్టుదలతో ఉంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా , ఎంతటి వారైనా సరే పట్టుకుని తీరాల్సిందేనని ఆదేశించారు. దీంతో పోలీసులు కూపీ లాగుతున్నారు.
తాజాగా మాదాపూర్ డ్రగ్స్ కేసులో నటుడు నవదీప్ తో పాటు సినీ నిర్మాత ఉప్పలపాటి రవి, మోడల్ శ్వేత కూడా ఉన్నారని వారు పరారీలో ఉన్నారని ప్రకటించారు సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్(CV Anand). మరో వైపు తాను ఎక్కడికీ పారి పోలేదని , ఇక్కడే ఉన్నానంటూ నవదీప్ ప్రకటించడం విశేషం.
బెంగళూరు లో ఉన్న ముగ్గురు నైజీరియన్లు , అనేక మంది వినియోగదారులు పట్టుపడ్డారు. పరారీలో ఉన్న వారిని పట్టుకుంటామని చెప్పారు. ఇప్పటి వరకు కొకైన్ 8 గ్రాములు, ఎండీఎంఏ 50 గ్రాములు, ఎక్స్ టసీ పిల్స్ 24 , సెల్ ఫోన్లు 8 స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
Also Read : MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత హాజరు కావాల్సిందే