CWC : రాబోయే ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్
సీడబ్ల్యూసీ మీటింగ్ లో కీలక అంశాలు
CWC : హైదరాబాద్ – దేశంలో త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి ఎలాగైనా పవర్ లోకి రావాలని కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోంది. 10 ఏళ్ల మోదీ పాలనపై పూర్తి స్థాయిలో యుద్దం ప్రకటించింది. ఇదే సమయంలో హైదరాబాద్ లో ప్రస్తుతం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కీలక సమావేశం జరిగింది.
CWC Viral
ఈ సమావేశానికి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, సీపీపీ చైర్ పర్సన్ సోనియా గాంధీ, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi), పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణు గోపాల్ , ప్రియాంక గాంధీ , ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా పార్టీని బలోపేతం చేయడం, వివిధ రాష్ట్రాలలో జరిగే శాసనసభ ఎన్నికలలో మరోసారి ఎలా పవర్ లోకి రావాలనే దానిపై విస్తృతంగా చర్చించారు. ఇప్పటికే బీజేపీ ఆధీనంలో ఉన్న కర్ణాటకలో హస్తం హవా కొనసాగింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ.
ప్రస్తుతం తెలంగాణ, మధ్య ప్రదేశ్ , ఛత్తీస్ గఢ్ , రాజస్థాన్ రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. దీనిపై విస్తృతంగా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి భారీ ఊరట ఇచ్చేలా చేసింది హిమాచల్ ప్రదేశ్ , కర్ణాటక రాష్ట్రాలు. ఈ రెండిట్లో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి.
Also Read : Yennam Srinivas Reddy : యెన్నం కాంగ్రెస్ లోకి జంప్