Heavy Rain Tirumala : మాండూస్ ప్రభావం తిరుమలలో వర్షం
శ్రీవారి మెట్లు ద్వారా వరద నీరు ప్రవాహం
Heavy Rain Tirumala : మాండూస్ ప్రభావంతో అటు తమిళనాడు ఇటు ఏపీలో వానలు దంచి కొడుతున్నాయి. చెన్నై విల విల లాడుతోంది. సముద్రంలో అలలు ఉప్పొంగుతున్నాయి. తుపాను తీవ్ర ప్రభావం ఇటు తిరుమలను(Heavy Rain Tirumala) కూడా తాకింది. పెద్ద ఎత్తున ఎడ తెరిపి లేకుండా కురుస్తోంది. దీంతో స్వామి వారి దర్శనం కోసం వచ్చిన భక్తులు నానా తంటాలు పడుతున్నారు.
మరో వైపు శ్రీవారి మెట్లు ద్వారా వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో నడక మార్గాన్ని ఆశ్రయించిన భక్తులు లబోదిబోమంటున్నారు. ఇక ఘాట్ రోడ్డు గుండా వచ్చే భక్తులు, యాత్రికుల వెహికిల్స్ ను రావద్దని కోరింది తిరుమల తిరుపతి దేవస్థానం.
శనివారం వర్షం తీవ్రత మరింత ఎక్కువైంది. ఇక మాండూస్ దెబ్బకు తమిళనాడులోని 26 జిల్లాలు అస్తవ్యస్తంగా మారాయి. ఇక కోస్తాంధ్ర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీని కారణంగా చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో వర్షం తాకిడికి జనం చిగురుటాకుల్లా వణుకుతున్నారు.
ఇక తిరుపతిని వర్షం ముంచెత్తింది. రహదారులు నీటితో నిండి పోయాయి. మాల్వాడి గుండంలోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భక్తులను కపిలతీర్థం వద్దనున్న పుష్కరిణికి చేరుకునేందుకు వీలు లేదంటూ ఆదేశించింది టీటీడీ(Heavy Rain Tirumala). ద్విచక్ర వాహనాల రాకపోకలు నిలిపి వేశారు.
పాప వినాశనం, శిలా తోరణం ద్వారా వచ్చే మార్గాలను కూడా మూసి వేస్తున్నట్లు ప్రకటించింది టీటీడీ. ఇదిలా ఉండగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు టీటీడీ తెలిపింది.
Also Read : లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తా – జేడీ