Cyclone Mandous : మాండూస్ బీభత్సం అతలాకుతలం
తమిళనాడు..ఆంధ్రప్రదేశ్ విలవిల
Cyclone Mandous : బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. తీరం దాటింది మాండూస్(Cyclone Mandous) తుపాను. దీంతో భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరించింది. ప్రస్తుతం తమిళనాడును వణికిస్తోంది. శనివారం ఉదయం శ్రీహరి కోటను దాటింది.
మహాబలిపురం దగ్గర తీరం దాటడంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. గాలుల తీవ్రతకు చేపల వేట కోసం ఏర్పాటు చేసిన బోట్లు ధ్వంసమయ్యాయి. తుపాను దెబ్బకు ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
మాండూస్ తుపాను దెబ్బకు తమిళనాడు , ఏపీ వణుకుతున్నాయి. చెన్నైతో సహా 26 జిల్లాల్లో వర్షాలు ఎడ తెరిపి లేకుండా కురుస్తున్నాయి. పలు చోట్ల చెట్లు కూలాయి. భారీ ఎత్తున వర్షాలు కురుస్తుండడంతో ముందు జాగ్రత్తగా చెన్నై ఎయిర్ పోర్ట్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే విమానాలను రద్దు చేశారు.
ముందస్తుగా ప్రయాణికులకు తెలియ చేశారు. తుపాను హెచ్చరిక నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఈ మేరకు సహాయక చర్యలు చేపట్టింది. అవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ కోరింది. పలు చోట్ల విద్యుత్ సరఫరాను నిలిపి వేశారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం ఎంకే స్టాలిన్ ఆదేశించారు.
ఇక కాంచీపురం, చెంగల్పట్టు, విల్లుపురం తో పాటు పుదుచ్చేరిలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు సెలవులు ప్రకటించారు విద్యా సంస్థలకు.
Also Read : దేశంలో మనుషులంతా ఒక్కటే – రాహుల్