Daggubati Purandeswari : ఇస్రో విజయం గర్వకారణం
దగ్గుబాటి పురందేశ్వరి కామెంట్స్
Daggubati Purandeswari : ఏపీలోని శ్రీహరికోటలో ఇస్రో ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన చంద్రయాన్ -3 రాకెట్ నింగిలోకి విజయవంతంగా వెళ్లింది. ఈ సందర్భంగా యావత్ భారత దేశం అంతటా సంబురాలు మిన్నంటాయి. పలువురు ఇస్రో టీంను అభినందనలతో ముంచెత్తుతున్నారు.
ఈ సందర్బంగాన్ని పురస్కరించుకుని ఏపీ భారతీయ జనతా పార్టీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి(Daggubati Purandeswari) స్పందించారు. ఇస్రో టీంను ప్రత్యేకంగా అభినందించారు. యావత్ భారత దేశం మిమ్మల్ని చూసి గర్విస్తోందని పేర్కొన్నారు.
శుక్రవారం ఏపీ పర్యటనలో ఉన్న పురందేశ్వరి మీడియాతో మాట్లాడారు. సమర్థవంతమైన ప్రభుత్వం, యావత్ ప్రపంచం మెచ్చిన నాయకుడు మోదీ సారథ్యంలో భారత్ అన్ని రంగాలలో ముందంజలో వెళుతోందని పేర్కొన్నారు.
అంతరిక్ష చరిత్రలో భారత జాతీయ పతాకం మరోసారి రెప రెప లాడిందని ప్రశంసించారు. చంద్రయాన్ -3 ప్రయోగం సక్సెస్ వెనుక కృషి చేసిన ఇస్రో చైర్మన్ సోమ్ నాథ్ , శాస్త్రవేత్తలను, ఇందులో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని పేరు పేరునా అభినందిస్తున్నట్లు తెలిపారు పురందేశ్వరి.
ఇదిలా ఉండగా ఇవాళ ఇస్రో విజయవంతంగా కక్ష్యలోకి చంద్రయాన్ -3 (బాహుబలి రాకెట్ )ను పంపించ గలిగింది. ఈ రాకెట్ మూడు దశలలో చంద్రుడి వద్దకు చేరుకుంటుంది. అక్కడి నుంచి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తుంది. ఫోటోలు, వాతావరణ మార్పులను సైతం తెలియ చేస్తుంది.
Also Read : PM Modi Jai Hind : ఇస్రో టీంకు మోదీ సలాం