Daggubati Purandeswari : పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తా
దగ్గుబాటి పురందేశ్వరి
Daggubati Purandeswari : అమరావతి – ఏపీ భారతీయ జనతా పార్టీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. తాము జన సేన పార్టీతో పొత్తులో ఉన్నామని కుండ బద్దలు కొట్టారు. ఆమె మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ కూడా ఇదే విషయంపై పలుమార్లు స్పష్టం చేశారని తెలిపారు.
Daggubati Purandeswari Comment
ఇదిలా ఉండగా తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు కుదుర్చుకునే విషయంపై కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుందని చెప్పారు. నేను పలానా చోటు నుంచి పోటీ చేస్తానని మోదీని, అమిత్ షా ను, జేపీ నడ్డాను అడగలేదన్నారు.
పార్టీ ఎక్కడి నుంచి బరిలో ఉండమంటే అక్కడి నుంచి పోటీ చేస్తానని వెల్లడించారు దగ్గుబాటి పురందేశ్వరి(Daggubati Purandeswari). త్వరలోనే రాష్ట్రంలో శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు సార్వత్రిక ఎన్నికలు కూడా రానున్నాయి. దీంతో అధికారంలో ఉన్న వైసీపీతో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ , వామపక్షాలు ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నాయి.
రాష్ట్రంలో 175 స్థానాలు ఉన్నాయి. వై నాట్ 175 అనే నినాదంతో జగన్ మోహన్ రెడ్డి ముందుకు వెళుతున్నారు. జనసేన పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుందనే విషయంపై తనకు తెలియదన్నారు దగ్గుబాటు పురందేశ్వరి.
Also Read : Uttam Kumar Reddy : కాళేశ్వరం తెలంగాణకు శాపం