Daggubati Purandeswari : బీజేపీ ప్ర‌గ‌తిని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాలి

ఏపీ చీఫ్ ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి పిలుపు

Daggubati Purandeswari : ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర భార‌తీయ జ‌న‌తా పార్టీ చీఫ్ గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి(Daggubati Purandeswari) దూకుడు పెంచారు. ఆమె సంత‌కం చేసిన వెంట‌నే కార్య రంగంలోకి దిగారు. క‌ష్ట ప‌డిన వారికి త‌ప్ప‌క ప్ర‌యారిటీ ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలో కొలువు తీరిన వైసీపీ స‌ర్కార్ కు ప్ర‌త్యామ్నాయం బీజేపీ కావాల‌ని ఇందు కోసం ప్ర‌తి ఒక్క‌రు కృషి చేయాల‌ని పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో బీజేపీని మ‌రింత బ‌లోపేతం చేసేందుకు తాను శ‌క్తి వంచ‌న లేకుండా కృషి చేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు. ఇందులో కీల‌క భూమిక పోషించాల్సింది నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌తో పాటు సోష‌ల్ మీడియా పాత్ర ముఖ్య‌మ‌ని అన్నారు పురందేశ్వ‌రి.

మ‌నం ఎంత‌గా ప్ర‌య‌త్నం చేసినా ఇంకా ప్ర‌జ‌ల్లోకి వెళ్లాలంటే స‌రైన దారి సోష‌ల్ మీడియా అని పేర్కొన్నారు. దీనిని చాలా జాగ్ర‌త్త‌గా వాడు కోవాల‌ని, ఎప్ప‌టిక‌ప్పుడు అప్ డేట్స్ ఇస్తూ ఉండాల‌ని దీని వ‌ల్ల మ‌నం ఏం చేస్తున్నామ‌నేది ప్ర‌జ‌లు తెలుసుకునే అవ‌కాశం క‌లుగుతుంద‌న్నారు పురందేశ్వ‌రి.

స‌మ‌ర్థ‌వంత‌మైన నాయ‌కుడు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ సార‌థ్యంలో బీజేపీ ప్ర‌భుత్వం వంద‌లాది సంక్షేమ ప‌థ‌కాల‌ను, కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేస్తోంద‌న్నారు. ఇందులో భాగంగా ఏపీకి కూడా భారీ ఎత్తున నిధులు కేటాయించింద‌ని వీటి గురించి కూడా తెలియ చేసేందుకు ప్ర‌య‌త్నించాల‌ని సూచించారు.

Also Read : Ambati Rambabu : ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏక‌ప‌త్నీవ్రతుడు

Leave A Reply

Your Email Id will not be published!