Daggubati Purandeswari : కేంద్రం నిధులతో జగన్ ప్రచారం
బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి
Daggubati Purandeswari : ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు భారతీయ జనతా పార్టీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి(Daggubati Purandeswari). కేంద్రం ఏపీ అభివృద్ది కోసం నిధులను ఇస్తోందన్నారు. ఇప్పటి వరకు వాటికి సంబంధించి ప్రభుత్వం లెక్కలు చెప్పలేదని ఆరోపించారు. కేవలం రాష్ట్రంలో పేదలకు ఇళ్లు ఉండాలనే ఉద్దేశంతో కేంద్రం రూ.20,000 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. కానీ ఇప్పటి వరకు 65 శాతానికి పైగా ఇళ్లు నిర్మాణం కావాల్సి ఉండగా 30 శాతం కూడా పూర్తి కాలేదని ఆరోపించారు దగ్గుబాటి పురందేశ్వరి.
అంతే కాకుండా రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాల నిర్మాణానికి నిధులు ఇస్తే జగన్ రెడ్డి తన ప్రచారానికి వాడుకుంటున్నాడని సంచలన ఆరోపణలు చేశారు బీజేపీ స్టేట్ చీఫ్. ప్రతి కేంద్ర పథకానికి సంబంధించిన పేర్లను తీసేశాడని , కేవలం తన పేరు మాత్రం ఉండేలా, వచ్చేలా, ప్రచారం జరిగేలా చేశాడంటూ మండిపడ్డారు. జగన్ తన స్వంత డబ్బులను ప్రజలకు ఇవ్వడం లేదని తెలుసు కోవాలన్నారు.
ఇకనైనా ప్రజలు మేలుకోవాలని అన్నారు. ముందు కేంద్రం నుంచి మంజూరైన నిధుల గురించి శ్వేతపత్రం విడుదల చేయాలని దగ్గుబాటి పురందేశ్వరి డిమాండ్ చేశారు.
Also Read : ED Raids Ponmudi : తమిళనాడు మంత్రి పొన్ముడిపై ఈడీ రైడ్స్